Two Earthquakes: జపాన్ సముద్ర తీరంలో భూకంపం.. అరగంట వ్యవధిలోనే రెండు సార్లు కంపించిన భూమి..

ప్రపంచ దేశాల్లో ఏదో ఒక మూల భూకంపాలు సంభవించడం సర్వసాధారణం అయిపోయింది. సాధారణంగా జపాన్ లో అత్యధికంగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. మొన్నటి వరకూ ఆఫ్ఘనిస్థాన్, లడక్, కాశ్మీర్ లో భూకంపాలు సంభవించాయి. అయితే ఇవన్నీ భూమిపై జనావాసాలు ఉండే ప్రాంతంలో ఏర్పాడినవి. తాజాగా జపాన్‌ సముద్ర తీరంతో గంట వ్యవధిలోనే రెండు భూకంపాలు సంభవించాయి.

Two Earthquakes: జపాన్ సముద్ర తీరంలో భూకంపం.. అరగంట వ్యవధిలోనే రెండు సార్లు కంపించిన భూమి..
Japan Two Earthquakes
Follow us
Srikar T

|

Updated on: Dec 28, 2023 | 5:07 PM

ప్రపంచ దేశాల్లో ఏదో ఒక మూల భూకంపాలు సంభవించడం సర్వసాధారణం అయిపోయింది. సాధారణంగా జపాన్ లో అత్యధికంగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. మొన్నటి వరకూ ఆఫ్ఘనిస్థాన్, లడక్, కాశ్మీర్ లో భూకంపాలు సంభవించాయి. అయితే ఇవన్నీ భూమిపై జనావాసాలు ఉండే ప్రాంతంలో ఏర్పాడినవి. తాజాగా జపాన్‌ సముద్ర తీరంతో గంట వ్యవధిలోనే రెండు భూకంపాలు సంభవించాయి. మొదటి భూకంపం​ రిక్టర్‌ స్కేల్‌పై 6.5 తీవ్రత, రెండో భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై 5.0 తీవ్రతో నమోదైనట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ జీయోలాజీకల్‌ సర్వే(USGS) తెలిపింది. గురువారం నాడు సముద్ర తీరంలో రెండు సార్లు భూకంపం ఏర్పడటంతో తీరం వెంబడి ప్రాంతం మొత్తం రెండు సార్లు కంపించింది. రెండు భూకంపాలలో పెద్దది జపాన్‌లోని నామీ నగరానికి తూర్పు-ఆగ్నేయంగా దాదాపు 35 మైళ్ల దూరంలో సంభవించింది.

జపాన్‌లోని కురిల్ దీవుల్లో ఈరోజు మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో మొదటి భూకంపం సంభవించగా, రెండో భూకంపం మధ్యాహ్నం 3.07 గంటల సమయంలో భూకంపం ఏర్పాడింది. ఈ భూకంపాల తీవ్రతపై యునైటెడ్‌ స్టేట్స్‌ జీయోలాజీకల్‌ సర్వే కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. ఈ రెండు భూకంపాలు సముద్రం తీరంలో 23.8 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల లోతులో సంభవించినట్లు తెలిపింది. అయితే భూకంపం వల్ల భూమిపై ఎంతమేర నష్టం జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కేవలం అరగంట వ్యవధిలోనే రెండు సార్లు సంభవించిన ఈ భూకంపాల్లో ఎటువంటి ప్రాణ, ఆ‍స్తి నష్టం జరగలేదని ఆధికారులు వెల్లడిం‍చారు. దీని తీవ్రత అత్యధికంగా నమోదైతే సునామీ లాంటి ఉపద్రవాలు ఏర్పడే ప్రభావం ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు. ఇప్పుడు సంభవించిన భూకంపం చాల స్వల్ప తీవ్రతతో ఏర్పడినదిగా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..