World Without Tomatoes: రోజు రోజుకీ పెరుగుతున్న వాతావరణ కాలుష్యంతో.. పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో మానవాళి జీవితంపై తీవ్ర ప్రభావం చూపించనున్నది.. భూమిమీదనే కాదు.. సముద్రంలో నివసించే జీవ రాశుల సహా అనేకం అంతరించిపోతాయని శాస్త్రజ్ఞులు ఎప్పటి నుంచో ప్రపంచ దేశాలను హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా శాస్త్రవేత్తల అధ్యయనంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. రోజు రోజుకీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల వేడితో టమాటాలు అంతరించిపోతాయని.. త్వరలో టమాటాలు లేని ప్రపంచాన్ని చూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
భారతీయుల వంటల్లోనే కాదు.. దాదాపు ప్రపంచ దేశాల ప్రజలు ఆహారంలో వినియోగించే కూరగాయల్లో టొమాటోలు మొదటి స్థానంలో ఉన్నాయి. ఏ రకమైన ఆహారపదార్ధాల్లోనా టొమాటోలను జోడిస్తే.. అప్పుడు వచ్చే రుచి మరింత మధురం అని అంటారు. కూరల్లో గ్రేవీ కోసం, సూప్స్, బిర్యానీ, పాస్తా, మ్యాగీ ఇలా ఏ విధమైన ఆహారమైనా సరే.. టమాటాలు ఉండాల్సిందే.. అయితే రోజు రోజుకీ పెరుగుతున్న కాలిష్యం, ఉష్ణోగ్రతల వేడి.. వాతావరణ మార్పులతో రానున్న సంవత్సరాల్లో ప్రపంచ టమోటాల పంటపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం తెలిపింది. దీంతో టమాటా కొరత తీవ్రంగా ఏర్పడుతుందని ఇటీవల ‘నేచర్’లో ప్రచురించబడిన ఒక అధ్యయనం పేర్కొంది.
డెన్మార్క్‌లోని ఆర్హస్ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రత టమోటాల ఉత్పత్తిపై ఎలా ప్రభావితం చేస్తుందో అంచనా వేయడానికి అధ్యయనంలో పునరుత్పత్తి చేయబడిన గణిత నమూనాను రూపొందించారు.
ఇటలీ, చైనా, కాలిఫోర్నియా దేశాలు టొమాటో ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయని వారు చెప్పారు. ప్రపంచ ఉత్పత్తిలో మూడింట రెండు వంతులు ఇక్కడే టమాటా ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ దేశాలు గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రమాదంలో ఉన్నాయని అధ్యయనం తెలిపింది.దీంతో 2050 నుంచి 2100 మధ్య టమాటా పంట సగానికి తగ్గిపోతుందని పరిశోధకులు కనుగొన్నారు.
అధ్యయనం ప్రకారం, 2050 నాటికి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలను దాటితే.. టొమాటో ఉత్పత్తి ఆరు శాతం తగ్గుతుందని పేర్కొన్నారు. మొత్తానికి 2050 నాటికి టమాటా ఉత్పత్తి సగానికి పడిపోతుందన్నారు. భారత్‌లో ఇటీవల వడగాలుల కారణంగా టమాటా ఉత్పత్తి తగ్గి ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..