సౌత్ కొరియాలోని ఓ విమానం గాల్లో ఎగురుతుండగానే దాని డోర్ తెరుచుకోవడం కలకలం రేపింది. ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే ఏసియనా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ A321 విమానం సౌత్ కొరియాలోని డేగు పట్టణం నుంచి జెజు ద్వీపానికి వెళ్తోంది. దాదాపు 194 మంది ప్రయాణికులు ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే డేగు నుంచి జెజుకు చేరుకోవడానికి ఆ ఫ్లైట్‌కు గంట సమయం పడుతుంది. అయితే అది గాల్లో ప్రయాణిస్తుండగానే ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఎమర్జెన్సీ ఎక్జిట్ డోర్ తెరవడం చర్చనీయాంశమైంది
అందులో ఉన్న ప్రయాణికులు అతడ్ని డోర్ తెరవకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ డోర్‌ను అతను తెరిచాడు. దీంతో ఒక్కసారిగా బలమైన గాలులు ఫ్లైట్‌లోకి దూసుకురావడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎట్టకేలకు విమానం ల్యాండ్ అయ్యాక అధికారులు ఆ డోర్ తెరిచిన వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే అతను ఎందుకు అలా తెరిచాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండటంతో నెటిజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
విమానం డోర్ తెరుచుకోవడంతో వణికిపోయిన ప్రయాణీకులు..
La puerta de un #avión de #AsianaAirlines se abrió en el aire antes de aterrizar. Seis pasajeros sufrieron dificultad para respirar, informó Noticias Yonhap.
El avión de Asiana Airlines aterrizó de forma segura en el Aeropuerto Internacional de #Daegu. pic.twitter.com/hfnDsNrTDk
— ????? ????? (@Mario_Moray) May 26, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..