AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nazi typist: 10,505 మందిని చంపిన మహిళా టైపిస్ట్‌కు కేవలం 2 సంవత్సరాల శిక్ష మాత్రమే!.. ఇదేక్కడి న్యాయంరా బాబు..!!

ఇలా జరిగినందుకు నన్ను క్షమించండి అంటూ కోర్టు విచారణ సందర్భంగా ఫోర్చ్నర్ విజ్ఞప్తి చేసింది. ఆ సమయంలో నేను స్టట్‌థాఫ్‌లో ఉన్నాను. నేను క్షమాపణ మాత్రమే చెప్పగలనంటూ విన్నవించుకున్నారు.

Nazi typist: 10,505 మందిని చంపిన మహిళా టైపిస్ట్‌కు కేవలం 2 సంవత్సరాల శిక్ష మాత్రమే!.. ఇదేక్కడి న్యాయంరా బాబు..!!
Nazi Typist
Jyothi Gadda
|

Updated on: Dec 21, 2022 | 5:17 PM

Share

పోలాండ్‌లోని కాన్‌సెంట్రేషన్ క్యాంపులో పనిచేసిన 97 ఏళ్ల మాజీ నాజీ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ 10,505 మంది హత్యలలో ఆమెకు ప్రమేయం ఉండటంతో దోషిగా నిర్ధారించబడింది. ఈ సమాచారం మీడియా నివేదికలలో ఇవ్వబడింది. ఇట్జెహోలోని జర్మన్ కోర్టు మంగళవారం ఎర్గార్డ్ ఫోర్చ్‌నర్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించినట్లు పలు మీడియాల్లో వార్తలు ప్రసారమయ్యాయి. మైనర్‌గా , ఫోర్చ్నర్ 1943 నుండి 1945లో నాజీ పాలన ముగిసే వరకు గ్డాన్స్క్ సమీపంలోని స్టట్‌థాఫ్ క్యాంప్‌లో నాజీ-ఆక్రమిత పోలాండ్‌లో పనిచేసింది. నేరం జరిగినప్పుడు ఆ మహిళ మైనర్ అయినందున ఫోర్చ్‌నర్‌కు శిక్ష జువైనల్ కోర్టులో నమోదు చేయబడుతుంది.

యూదు ఖైదీలు, యూదుయేతర వ్యక్తులు, పట్టుబడిన సోవియట్ సైనికులతో సహా దాదాపు 65,000 మంది ప్రజలు స్టట్‌థాఫ్‌లో భయంకరమైన పరిస్థితులలో మరణించారు. నివేదిక ప్రకారం, ఫోర్చ్నర్ 10,505 మంది హత్యలకు సహకరించినందుకు దోషిగా తేలింది. మరో ఐదుగురి హత్యాయత్నాల్లో ప్రమేయం ఉన్నట్లు తేలింది. Stutthof వద్ద, జూన్ 1944 నుండి ఖైదీలను చంపడానికి వివిధ పద్ధతులు ఉపయోగించారట. గ్యాస్ ఛాంబర్లలో వేలాది మంది చనిపోయారు. సెప్టెంబర్ 2021లో విచారణ ప్రారంభమయ్యే సమయానికి ఫోర్చ్నర్ అదృశ్యమయ్యింది. ఆ తర్వాత విచారణలో ఆమె హాంబర్గ్‌లో పట్టుబడింది.

ఇలా జరిగినందుకు నన్ను క్షమించండి అంటూ కోర్టు విచారణ సందర్భంగా ఫోర్చ్నర్ విజ్ఞప్తి చేసింది. ఆ సమయంలో నేను స్టట్‌థాఫ్‌లో ఉన్నాను. నేను క్షమాపణ మాత్రమే చెప్పగలనంటూ విన్నవించుకున్నారు.

ఇవి కూడా చదవండి

జర్మనీలో నాజీ కాలం నాటి నేరాలకు సంబంధించి మహిళ విచారణ చివరిది కావచ్చని ప్రముఖ మీడియా నివేదించింది. అయితే కొన్ని కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి. స్టట్‌థాఫ్‌లో నాజీ నేరాలకు పాల్పడినట్లు ఇటీవలి సంవత్సరాలలో మరో రెండు కేసులు కోర్టుకు వెళ్లాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి