AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel: ఆ ఎయిర్ పోర్టులో ప్రయాణీకులకు సరికొత్త రూల్స్.. ఇకపై నో పాస్ పోర్టు, టికెట్.. ఎందుకంటే

ఆ దేశంలో పాస్ పోర్టు, టికెట్ వంటివి వాటితో పని లేకుండానే ఎంచక్కా ప్రయాణించేయవచ్చట. అక్కడ మీ ముఖమే ఒక బోర్డింగ్ పాస్ అట. అవునండీ మీరు చదువుతున్నది నిజమే.

Travel: ఆ ఎయిర్ పోర్టులో ప్రయాణీకులకు సరికొత్త రూల్స్.. ఇకపై నో పాస్ పోర్టు, టికెట్.. ఎందుకంటే
Facial Scanner
Madhu
| Edited By: |

Updated on: Dec 21, 2022 | 6:39 PM

Share

సాధారణంగా ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణం చేయాలంటే పాస్ పోర్ట్, వీసా, కావాలి విమాన టికెట్ వంటివి తప్పనిసరి. అయితే ఆ దేశంలో పాస్ పోర్టు, టికెట్ వంటివి వాటితో పని లేకుండానే ఎంచక్కా ప్రయాణించేయవచ్చట. అక్కడ మీ ముఖమే ఒక బోర్డింగ్ పాస్ అట. అవునండీ మీరు చదువుతున్నది నిజమే. యూఏఈ లోని అబుదాబీ ఎయిర్ పోర్టులో బయోమెట్రిక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రయాణికులు వారి ముఖాలు చూపిస్తే చాలు ఎయిర్ పోర్టులో బోర్డింగ్ పాస్ వచ్చేస్తుంది.

ఎయిర్ పోర్టులో పలు చోట్ల..

అబుదాబీ ఎయిర్ పోర్టులో దీని కోసం పలు చోట్ల ఫేస్ రికగ్నైజేషన్ మిషన్లను ఏర్పాటు చేశారు. సెల్ఫ్ సర్వీస్ బ్యాగేజ్ టచ్ పాయింట్లు, ఇమ్మిగ్రేషన్ ఈ గేట్స్, బోర్డింగ్ గేట్స్ వద్ద ఇవి అందుబాటులో ఉంచారు. ఆయా చోట్ల ప్రయాణికుల ముఖాలను క్యాప్చర్ చేయడానికి హైటెక్ బయోమెట్రిక్ కెమెరాలు ఎయిర్ పోర్టులో అమర్చారు.

మొదటి పూర్తి స్థాయి ఎయిర్ పోర్టు..

ఈ అడ్వాన్స్ డ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ని అబుదాబీలోని ఎన్ఈఎక్స్ టీ50 టెక్ కంపెనీ తయారు చేసింది. ఐడీఈఎంఐఏ, ఎస్ఐటీఏ సహకారంతో ఆ కంపెనీ దీనిని ఎయిర్ పోర్టుతో దీనిని లాంచ్ చేసింది. దీంతో ఈ వ్యవస్థ కలిగి తొలి అంతర్జాతీయ విమానాశ్రయంగా అబుదాబీ ఎయిర్ పోర్టు నిలిచింది. ఈ సందర్భంగా ఎన్ఈఎక్స్ టీ50 సీఈఓ ఇబ్రహీం అల్ మన్నే మాట్లాడుతూ ఎమిరేట్స్ డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ విజన్ లో భాగంగా తాము ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కూడిన బయోమెట్రిక్ వ్యవస్థకు రూపకల్పన చేసి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తే ప్రయాణికులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?