Charles Sobhraj: బికినీ కిల్లర్ చార్లెస్‌ శోభరాజ్‌‌ను విడుదల చేయండి.. కీలక ఆదేశాలు ఇచ్చిన నేపాల్‌ సుప్రీంకోర్టు

క్రైమ్ ప్రపంచంలో 'బికినీ కిల్లర్', 'సీరియల్ కిల్లర్'గా పేరుగాంచిన శోభరాజ్ భారత్, థాయ్‌లాండ్, టర్కీ, ఇరాన్‌లలో 20 మందికి పైగా హత్యకు గురైనట్లు ఆరోపణలు ఉన్న..

Charles Sobhraj: బికినీ కిల్లర్ చార్లెస్‌ శోభరాజ్‌‌ను విడుదల చేయండి.. కీలక ఆదేశాలు ఇచ్చిన నేపాల్‌ సుప్రీంకోర్టు
French Serial Killer Charles Sobhraj
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 21, 2022 | 8:10 PM

ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా జైలు నుంచి విడుదలైన 15 రోజుల లోపలే శోభరాజ్‌ను దేశం నుంచి పంపించేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చార్లెస్‌ శోభరాజ్‌ ఇద్దరు అమెరికా టూరిస్టులను హత్య చేసిన కేసులో 2003లో నేపాల్‌లో అరెస్టయ్యాడు. వయసు ఆధారంగా శోభరాజ్‌ని విడుదల చేశారు. హత్యా నేరం కింద 2003 నుంచి నేపాలీ జైలులో ఉన్నాడు. విడుదలైన 15 రోజుల్లోగా అతడిని దేశ నుంచి బహిష్కరించాలని కూడా కోర్టు ఆదేశించింది. క్రైమ్ ప్రపంచంలో ‘బికినీ కిల్లర్’, ‘సీరియల్ కిల్లర్’గా పేరుగాంచిన శోభరాజ్ భారత్, థాయ్‌లాండ్, టర్కీ, ఇరాన్‌లలో 20 మందికి పైగా హత్యకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి.

నేపాల్‌ సుప్రీంకోర్టు అతనికి జీవితఖైదు విధించింది. దాదాపు 20 ఏండ్లుగా జైలుశిక్ష అనుభవిస్తుండటం, వృద్ధాప్యం దరిచేరడం లాంటి కారణాలతో చార్లెస్‌ శోభరాజ్‌ విడుదలకు ఆదేశిస్తున్నట్టు నేపాల్‌ సుప్రీంకోర్టు పేర్కొన్నది. అంతకు ముందు 1976 నుంచి 1997 వరకు భారత జైళ్లలో చార్లెస్‌ శోభరాజ్‌ శిక్ష అనుభవించాడు.

1975లో నేపాల్‌లోకి ప్రవేశించడానికి నకిలీ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి దొరికి పోయాడు. భారతీయ తండ్రి, వియత్నామీస్ తల్లికి జన్మించాడు శోభరాజ్. అయితే ఆ తర్వాత తల్లి రెండో భర్త శోభరాజ్‌ను దత్తత తీసుకున్నాడు. కానీ, వారికి పిల్లలు కలిగిన తర్వాత శోభరాజ్‌ను నిర్లక్ష్యం చేశారు. దీంతో శోభరాజ్ నేరాలు చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆగ్నేయాసియా దేశాల్లో వరుస హత్యలు, దోపిడీలు, మోసాలతో చెలరేగిపోయాడు. దాంతో అప్పట్లో ప్రపంచ దేశాల్లో అతని పేరు మారుమోగింది.

ఇద్దరు పర్యాటకులను చంపేశారని ఆభియోగాలున్నాయి. అమెరికన్ జాతీయుడైన కొన్నీ జో బోరోంజిచ్, అతని కెనడియన్ స్నేహితురాలు లారెంట్ క్యారియర్లను హత్య చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ ఆభియోగాలతో 2003లో అరెస్టయ్యాడు. సెప్టెంబర్ 1, 2003న, ఒక వార్తాపత్రికల్లో వచ్చిన అతని చిత్రాన్ని చూసి నేపాల్ పోలీసులు పట్టుకున్నారు. నేపాల్‌లోని ఒక కాసినో వెలుపల శోభరాజ్ కనిపించడంతో అరెస్ట్ చేశాడు. అతని అరెస్టు తర్వాత, 1975లో ఖాట్మండు, భక్తపూర్‌లో జంటను హత్య చేసినందుకు పోలీసులు అతనిపై రెండు వేర్వేరు హత్య కేసులు నమోదు చేశారు.

ఖాట్మండు సెంట్రల్ జైలులో 21 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఒక అమెరికన్ పౌరుడిని హత్య చేసినందుకు అతనికి 20 సంవత్సరాలు, నకిలీ పాస్‌పోర్ట్ ఉపయోగించినందుకు ఒక సంవత్సరం జైలు శిక్ష పడింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..