Irish Man: 93 ఏళ్ళ వయసులోను తగ్గని జోరు.. ఆ పోటీల్లో ఏకంగా 4 అవార్డులు..

|

Jan 26, 2024 | 3:24 PM

ఈమధ్య కాలంలో ఐరిష్ మనిషి వార్తల్లోకి ఎక్కారు. అతని శరీరదారుఢ్యంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అతని పేరు మోర్గాన్, వయసు93 ఏళ్లు అయినప్పటికీ 43 ఏళ్ల యువకుడిలా యాక్టీవ్గా ఉన్నారు. ఇంతటితో సరిపెట్టక 70 ఏళ్ల వయసులో రోయింగ్‌ అంటే పడవ రేస్‌‎లో పాల్గొని నాలుగుసార్లు చాంపీయన్‌గా నిలిచారు. 2007, 2017, 2021, 2022లో జరిగిన పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు.

Irish Man: 93 ఏళ్ళ వయసులోను తగ్గని జోరు.. ఆ పోటీల్లో ఏకంగా 4 అవార్డులు..
Irish Man
Follow us on

ఈమధ్య కాలంలో ఐరిష్ మనిషి వార్తల్లోకి ఎక్కారు. అతని శరీరదారుఢ్యంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అతని పేరు మోర్గాన్, వయసు93 ఏళ్లు అయినప్పటికీ 43 ఏళ్ల యువకుడిలా యాక్టీవ్గా ఉన్నారు. ఇంతటితో సరిపెట్టక 70 ఏళ్ల వయసులో రోయింగ్‌ అంటే పడవ రేస్‌‎లో పాల్గొని నాలుగుసార్లు చాంపీయన్‌గా నిలిచారు. 2007, 2017, 2021, 2022లో జరిగిన పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. దీంతో అతడి ఎనర్జీని చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. పైగా ఎవరన్నా అతడిని చూస్తే అస్సలు వృద్దుడని అనుకోరు. తన జీవితంలో బేకరర్‎గా కొంత కాలం పనిచేసినట్లు తెలిపారు. అలాగే ఐర్లాండ్, జపాన్‎లలో కెమికల్ ఆపరేటర్ గా వృత్తిని నిర్వర్తించినట్లు తెలిపారు. యువకుడిలాగా మంచి దేహ దారుఢ్యంతో, అందంగా కనిపిస్తున్నారు. అతనిపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేశారు. అతడి హృదయ స్పందన రేటుని చూసి షాక్‎కి గురయ్యారు.

మోర్గాన్‌ ఫిట్‌నెస్‌, ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై పరిశోధకులు కీలక విషయాలను వెలువరించారు. దీంతో ఆయన వార్తల్లో నిలిచారు. అంతేగాదు అతని శరీరంలోని 80% కండర ద్రవ్యరాశి, గుండె పనితీరుని ఔరా అనిపిస్తున్నాయి. 90లోనూ 40 ఏళ్ల వ్యక్తిని పోలి ఉందని చెప్పారు. అలాగే ఎంతో మంది యువకులకు స్పూర్తిగా నిలుస్తున్నట్లు చెప్పారు. అతనిని చూసి ప్రస్తుత జనరేషన్ తమ జీవన శైలి, ఆహార పద్ధతులు, చేసే వ్యాయమాలు తదితరాలను నేర్చుకోవాలని సూచిస్తున్నారు. పలువురు వైద్య శాస్త్ర వేత్తలు ఆయన శరీరంలోని శక్తిసామర్ధ్యాలను పరిశీలించారు. అతడి శారీరక పనితీరు, పోషకాహారం తీసుకోవడం తదితరాలను బయో ఎలక్ట్రిక్‌ ఇంపెడెన్స్‌ ద్వారా అంచనా వేసింది. ఇక అతను ఆక్సిజన్‌ తీసుకోవడం, కార్బన్‌ డయాక్సైడ్‌ వదలడం, హార్ట్ బీట్ రేటు తదితర అంశాలను రోయింగ్‌ ఎర్గోమీటర్‌తో కొలిచారు. ఇతనికి చేసిన పరిశోధనల ఫలితాలు చేసి ఆశ్చర్యానిక గురైన జర్నల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఫిజియాలజీ గత నెలలో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటి వరకూ మనం తెలుసుకున్న విషయాలు ఒక ఎత్తైతే ఇప్పుడు తెలుసుకోబోయే విషయం మరో ఎత్తు.

మోర్గాన్‌ చిన్నప్పటి నుంచి ఎలాంటి వ్యాయామాలు చేయలేదు. ఎలాంటి శిక్షణా తరగతులకు వెళ్లలేదు. తాను 73 ఏళ్ల వయసులో వ్యాయామం ప్రారంభించానని, ఆ తర్వాత రోయింగ్ క్రీడలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించానన్నారు. తనకు వ్యాయామం చేయడంలో ఆనందం ఉందని పేర్కొన్నారు. ఈ విషయం తనకు తెలిశాక ఎప్పుడూ ఆపేందుకు సిద్దపడలేదని చెప్పారు. తన ఫిట్‎నెస్ రోయింగ్‌ క్రీడో పాల్గొనేలా చేసిందని చెప్పారు. వ్యాయామం మంచి ఫిట్‌నెస్‌గా ఉండేలా చేయడమే గాక సర్వసాధారణంగా వయసు రీత్య వచ్చే శరీరంలోని వృద్ధాప్య ప్రభావాలను అరికడుతుందని మోర్గాన్‌పై జరిపిన పరిశోధనలో తెలిందని చెబుతున్నారు పరిశోధకులు. ప్రతి రోజు అతను వ్యాయామం స్కిప్‌ చేయకపోవడంతోపాటు బరువుకి సంబంధించిన వ్యాయామాలు, ప్రోటీన్‌ ఆహారం తీసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు చెప్పారు. మోర్గాన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఐర్లాండ్‎లో గలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..