Bus: ప్రయాణికుల బస్సుపై దుండగుల కాల్పులు.. 8 మంది మృతి, 26 మందికి తీవ్రగాయాలు

|

Dec 03, 2023 | 10:21 AM

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిత్ బాల్టిస్తాన్ వద్ద ప్రయాణీకుల బస్సుపై కాల్పుల ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది గాయపడినట్లు శనివారం డిప్యూటీ కమిషనర్ డైమర్ కెప్టెన్ (రిటైర్డ్) ఆరిఫ్ అహ్మద్‌ వెల్లడించారు. గుర్తు తెలియని దుండగులు ప్రయాణీకుల బస్సుపై కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు. దీంతో బస్సు నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొట్టినట్లు వెల్లడించారు. కశ్మీర్‌లోని చిలాస్ జిల్లాలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొత్తం..

Bus: ప్రయాణికుల బస్సుపై దుండగుల కాల్పులు.. 8 మంది మృతి, 26 మందికి తీవ్రగాయాలు
Shooting At The Bus
Follow us on

ఇస్లామాబాద్‌, డిసెంబర్‌ 3: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిత్ బాల్టిస్తాన్ వద్ద ప్రయాణీకుల బస్సుపై కాల్పుల ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది గాయపడినట్లు శనివారం డిప్యూటీ కమిషనర్ డైమర్ కెప్టెన్ (రిటైర్డ్) ఆరిఫ్ అహ్మద్‌ వెల్లడించారు. గుర్తు తెలియని దుండగులు ప్రయాణీకుల బస్సుపై కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు. దీంతో బస్సు నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొట్టినట్లు వెల్లడించారు. కశ్మీర్‌లోని చిలాస్ జిల్లాలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది మరణించినట్లు ధృవీకరించారు. ఘిజర్ నుంచి రావల్పిండికి వెళ్తున్న బస్సుపై దాడి జరిగినట్లు తెలిపారు.

కాగా గిల్గిట్‌ బాల్టిస్తాన్‌ పర్వత ప్రాంతంలో ఉన్న చిలాస్‌ నగరం వద్ద తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. కొద్ది రోజుల క్రితం చిలాస్ సమీపంలో బస్సు లోయలో పడటంతో ముగ్గురు ప్రయాణికులు మరణించగా, 24 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రావల్పిండి నుంచి బయల్దేరిన బస్సు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొని లోయలో పడిపోయింది. దీంతో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌లు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను, మృతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఫిబ్రవరి 7న జరిగిన మరో సంఘటనలో.. గిల్గిట్-బాల్టిస్తాన్‌లోని చిలాస్ నగరంలోని కోహిస్తాన్ శాటియల్ చౌకీ సమీపంలో కారకోరం హైవేపై ప్రయాణీకుల బస్సు కారును ఢీకొనడంతో దాదాపు 25 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, కోహిస్తాన్ శాటియల్ చౌకీ సమీపంలోని కారకోరం హైవేపై ఎదురుగా వస్తున్న కారును ఢీకొని లోయలో పడిపోయింది. అయితే ఈ దాడులన్నీ తామే చేశామని పాకిస్థాన్‌ తాలిబన్‌, తెహ్రిక్‌ ఇ తాలిబన్‌ పాకిస్థాన్‌ వంటి ఉగ్రవాద సంస్థలు ప్రకటిస్తూ ఉంటాయి. అయితే తాజాగా జరిగిన ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించకపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.