Japan Earthquake: జపాన్ సముద్ర తీరంలో భారీ భూకంపం.. సునామీ వచ్చే అవకాశం
జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో నమోదైనట్లు తెలిపారు అధికారులు. సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. జనవరి 1న సోమవారం న్యూ ఇయర్ వేళ మధ్యాహ్నం ఉత్తర-మధ్య జపాన్‌లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. వెంటనే, జపాన్ వాతావరణ సంస్థ ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్ల తీర ప్రాంతాలలో సునామీ హెచ్చరికను జారీ చేసింది.
జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో నమోదైనట్లు తెలిపారు అధికారులు. సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. జనవరి 1న సోమవారం న్యూ ఇయర్ వేళ మధ్యాహ్నం ఉత్తర-మధ్య జపాన్‌లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. వెంటనే, జపాన్ వాతావరణ సంస్థ ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్ల తీర ప్రాంతాలలో సునామీ హెచ్చరికను జారీ చేసింది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు తెలిపారు అధికారులు.
నగరంలోని తీరానికి 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అనగా 3 అడుగుల ఎత్తులో అలలు తాకినట్లు నివేదించింది. భవిష్యత్తలో నీటి అలల ఉధృతి 5 మీటర్లకు ఎగిసిపడవచ్చని తెలిపింది. అనగా దాదాపు 16 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందంటున్నారు భూగర్భ శాస్త్ర నిపుణులు. స్థానిక ప్రజలు వీలైనంత త్వరగా సమీపంలోని ఎత్తైన భవనం పైకి పారిపోవాలని ప్రజలను హెచ్చరించింది సునామీ హెచ్చరికల కేంద్రం. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్లో డిస్ ప్లే బోర్డులు ఊగిపోతున్న విజువల్స్ ని వీడియో తీసి సామాజి మాధ్యమాల్లో పోస్ట్ చేసింది జపాన్ మీడియా. ఇందులో భూమి కంపించే వీడియో స్పష్టంగా కనిపిస్తోంది.
జపాన్ ప్రధాన ద్వీపమైన హోన్షు సముద్రం వైపున ఉన్న నోటో ప్రాంతంలో ఏడు సార్లు భూకంపం సంభవించింది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:06 గంటలకు 5.7 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించింది. వెనువెంటనే మరో భూకంపం సాయంత్రం 4:10 గంటలకు 7.6 తీవ్రతతో నమోదైనట్లు తెలిపారు అధికారులు. మరోసారి 4:18 గంటలకు 6.1 తీవ్రతతో, 4:23 గంటలకు 4.5 తీవ్రతతో, 4:29 గంటలకు 4.6, 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని జేఎంఏ నివేదికలో పేర్కొంది.
UPDATE: All high-speed trains stopped in Ishikawa Prefecture after powerful quakes hit western Japan – media pic.twitter.com/d0zkLNp8Rh
— RT (@RT_com) January 1, 2024
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..