China: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు..! రక్షణ శాఖ మంత్రిని మార్చిన డ్రాగన్ కంట్రీ.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ

తైవాన్ నుండి దక్షిణ చైనా సముద్రం వరకు జిన్‌పింగ్ డాంగ్‌కు ఓ పెద్ద పనిని కేటాయించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు రక్షణ మంత్రిగా పదవిని చేపట్టిన డాంగ్ వెంటనే తైవాన్‌పై దాడి చేయడానికి రెడీ అవుతోందా..? అందుకేనా కొత్త రక్షణ మంత్రి నియామకం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంపై చైనా ప్లాన్ ఏంటనేది కూడా ప్రశ్న ఉదయిస్తుంది. సముద్రంలో చైనా లక్ష్యాలు ఏమిటి? 

China: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు..! రక్షణ శాఖ మంత్రిని మార్చిన డ్రాగన్ కంట్రీ.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ
China Xi Jinping
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2023 | 1:37 PM

చైనా అధికార కాంక్ష… దేశం విస్తరణ కాంక్ష రోజురోజుకీ అధికం అవుతున్నట్లు ఉంది. ఇప్పటికే శత్రువులను లొంగ దీసుకోవడానికి మానవ మేథస్సు మీద కంట్రోల్ చేసే విధంగా సరికొత్త ప్రయోగాలను చేస్తూ సక్సెస్ అందుకుంది అన్న వార్తలను మరవక ముందే.. మళ్ళీ ఓ సంచలన విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.  ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. తాజాగా  చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తన రక్షణ మంత్రిని మార్చారు. చైనాలో పాత రక్షణ మంత్రి స్థానంలో డాంగ్ జున్ ను కొత్త రక్షణ మంత్రిని నియమించారు. ఇప్పటి వరకు చైనా నేవీ చీఫ్‌గా ఉన్న ఆయనను చైనా రక్షణ మంత్రిగా నియమించారు. నేవీ చీఫ్‌ను రక్షణ మంత్రిగా చేయాలని జిన్‌పింగ్ ఎందుకు నిర్ణయించుకున్నారు అనే ప్రశ్నలు ప్రపంచం ముందు ఉన్నాయి. అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వెనుక వారి ఆంతర్యం ఏమిటి అంటే ఈ ప్రశ్నకు సమాధానం చరిత్ర పుటల నుండి వస్తుంది.

నేవీ చీఫ్ కావడానికి ముందు డాంగ్ చైనా సదరన్ థియేటర్ కమాండ్‌కు డిప్యూటీ కమాండర్‌గా ఉన్నారు. సదరన్ థియేటర్ కమాండ్ అనేది చైనా నేవీలో ఒక భాగం. ఈ సెక్షన్ దక్షిణ చైనా సముద్రం తో పాటు తైవాన్ జలసంధి భద్రతకు బాధ్యత వహిస్తుంది. అంటే డాంగ్ జున్ తైవాన్ చైనా సముద్రం విషయంలో అత్యంత నైపుణ్యం కలిగిన వాడు. అందుకే జిన్‌పింగ్‌ ఆయనకు రక్షణ మంత్రిని చేశారు.

దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి పెద్ద టాస్క్

తైవాన్ నుండి దక్షిణ చైనా సముద్రం వరకు జిన్‌పింగ్ డాంగ్‌కు ఓ పెద్ద పనిని కేటాయించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు రక్షణ మంత్రిగా పదవిని చేపట్టిన డాంగ్ వెంటనే తైవాన్‌పై దాడి చేయడానికి రెడీ అవుతోందా..? అందుకేనా కొత్త రక్షణ మంత్రి నియామకం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంపై చైనా ప్లాన్ ఏంటనేది కూడా ప్రశ్న ఉదయిస్తుంది. సముద్రంలో చైనా లక్ష్యాలు ఏమిటి?  బ్లూ జోన్ నుండి డ్రాగన్ విధ్వంసం ప్రారంభించబోతుందా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుందా..!

చైనా .. తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తత ప్రపంచానికి పరిచయమే. చైనా ప్రభుత్వం తైవాన్‌ దేశాన్ని కూడా తమ భూభాగమే అని పరిగణిస్తుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. తన వాదనను ఒకసారి కాదు పదేపదే వినిపిస్తోంది కూడా.. మరోవైపు తైవాన్ కూడా చైనా చెబుతున్న మాటలను లెక్కచేయడం లేదు.. చైనా చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడానికి రెడీ అవుతుంది. అంతేకాదు చైనా కనుసైగ చేయడానికి ప్రయత్నించినా.. వెంటనే తైవాన్ తగిన సమాధానం ఇస్తుంది.

దక్షిణ చైనా సముద్ర వివాదం ఏమిటి?

మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పాలని చైనా భావిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో ఇండోనేషియా, మలేషియా, బ్రూనై దారుస్సలాం, ఫిలిప్పీన్స్, తైవాన్ తదితర ప్రాంతాలకు కూడా హక్కు ఉంది. ఈ సముద్రంపై ఈ దేశాల్లో వివాదం ఉంది. ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనికులు ఫోకస్ పెట్టారు. విన్యాసాలను చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జలమార్గాలలో ఒకటిగా పరిగణించబడుతున్నందున చైనా దక్షిణ చైనా సముద్రంపై దృష్టి సారించింది. చైనా ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పాలనుకునే కారణం ఇదే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..