New Year 2024: ప్రపంచ వ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు.. ఒక్కో దేశంలో ఒక్కో సమయం..
ప్రపంచ వ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు చాలా దేశాలు సంబరాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. అందరికంటే ముందుగా న్యూజిలాండ్‌లో న్యూఇయర్ ప్రారంభం అయింది. మన కంటే 6.30 గంటల ముందే న్యూజిలాండ్‌కు కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు న్యూజిలాండ్ 2024 జనవరి 1లోకి అడుగుపెట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు చాలా దేశాలు సంబరాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. అందరికంటే ముందుగా న్యూజిలాండ్‌లో న్యూఇయర్ ప్రారంభం అయింది. మన కంటే 6.30 గంటల ముందే న్యూజిలాండ్‌కు కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు న్యూజిలాండ్ 2024 జనవరి 1లోకి అడుగుపెట్టింది. ఆక్లాండ్ స్కై టవర్ నుంచి అద్భుతమైన దృశ్యం అవిష్కృతమైంది. రంగురంగుల బాణా సంచాతో పాటు అద్భుతమైన లైటింగ్ షో అక్కడి సందర్శకులను ఆకట్టుకున్నాయి. న్యూజిలాండ్ తరువాత న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే దేశం అస్ట్రేలియా. ఇక్కడ మనకంటే 5.30 గంటల ముందే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ హార్బర్ వద్ద నూతన సంవత్సరం సందర్భంగా లేజర్ షోను నిర్వహించారు. ఈ ఈవెంట్ చూపరులను ఆకట్టుకున్నాయి.
ఆ తరువాత కొత్త ఏడాది ప్రారంభమయ్యే దేశం జపాన్. ఇక్కడ మనకంటే 3.30 గంటల ముందే న్యూఇయర్‌లోకి అడుగుపెడుతుంది. జపాన్‌తో పాటు దక్షిణ కొరియా, ఉత్తర కొరియా కూడా 2024 జనవరి 1లోకి ప్రవేశిస్తాయి. ఇక మనదేశానికి ఆనుకొని ఉన్న భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లలో భారతదేశం కంటే 30 నిమిషాల ముందుగా నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇక మన భారతదేశంతో పాటు శ్రీలంక కూడా ఒకేసారి న్యూఇయర్ వేడుకలు జరుపుకుంటాయి. ఏకకాలంలో కొత్త ఏడాదిలోకి అడుగుపెడతాయి ఈ రెండు దేశాలు. అలాగే భారత్ తరువాత న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే దేశాలు ప్రపంచ వ్యాప్తంగా 43 ఉన్నాయి. అవి మనకు నాలుగున్నర గంటల తరువాత న్యూఇయర్‌ను జరుపుకుంటాయి. అంటే భారత కాలమానం ప్రకారం తెల్లవారి 4.30 గంటల ప్రాంతంలో ఈ 43 దేశాలకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందనమాట.
ఇక ఇంగ్లాండ్ కూడా మనకు ఐదున్నర గంటల తరువాత నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. అంటే తెల్లవారి జామున 5.30 గంటలకు ఇంగ్లాండ్ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోనుంది. ఇక అగ్రరాజ్యం అమెరికా విషయానికొస్తే.. మనకు పదిన్నర గంటల తరువాత కొత్త సంవత్సరాన్ని జరుపుకోబోతుంది. ఇండియాలో 2024 జనవరి 1 ఉదయం 10.30 గంటలకు అమెరికా జనవరి ఫస్ట్ జరుపుకోనుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో దేశానికి ఒక్కో రకమైన సమయం ఉండటం ప్రత్యేకతను సంతరించుకుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..