Bangladesh: ఘోర ప్రమాదం.. ప్రయాణికుల నౌకలో మంటలు.. 32 మంది సజీవ దహనం..

Bangladesh ferry fire: బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ భారీ నౌకలో మంటలు చెలరేగి 32 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన

Bangladesh: ఘోర ప్రమాదం.. ప్రయాణికుల నౌకలో మంటలు.. 32 మంది సజీవ దహనం..
Bangladesh Ferry Fire

Updated on: Dec 24, 2021 | 11:04 AM

Bangladesh ferry fire: బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ భారీ నౌకలో మంటలు చెలరేగి 32 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఝలోకఠి ప్రాంతంలోని నదిపై చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాజధాని ఢాకాకు దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝలోకతి సమీపంలో తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఓడలో దాదాపు 500 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా నుంచి బరుంగా వెళ్తున్న ఓ మూడంతస్తుల ప్రయాణికుల నౌకలో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. నౌక మూడో అంతస్థులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు నదిలోకి దూకగా.. మరికొందరు మంటల్లో చిక్కుకుని సజీవదహనమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు తీవ్రంగా గాయపడిన 100 మందిని బారిసాల్‌లోని ఆసుపత్రికి తరలించారు.

కాగా.. ఈ ఓడ ప్రమాదంలో చాలామంది ప్రయాణికులు మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని బంగ్లాదేశ్ అధికారులు వెల్లడించారు. ప్రమాదనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Viral Video: ఫైథాన్‌తోనే గేమ్సా.. సరదాగా ఎత్తుకుంటే క్షణాల్లోనే చుట్టేసింది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Hyderabad Road Accident: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్‌ దుర్మరణం