Telugu News World 3 Dead In Copenhagen Mall Shooting, Cops Checking Terror Angle
Denmark shooting: షాపింగ్‌మాల్‌లో ఆగంతకుడు హల్‌చల్.. గన్‌తో విచ్చలవిడి కాల్పులు.. ముగ్గురు మృతి
రద్దీగా ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో దూరిన ఆగంతకుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల ఘటనతో
Denmark shooting: అగ్రరాజ్యం అమెరికా కాల్పుల పరంపర ఇప్పుడు యూరప్ కు పాకింది. దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఐరోపా దేశం డెన్మార్క్ రాజధాని కోపెన్‌హగెన్ కాల్పులతో దద్దరిల్లింది. కోపెన్‌హగెన్‌లోని ఫీల్డ్స్ ప్రాంతంలో రద్దీగా ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో దూరిన ఆగంతకుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. కోపెన్ హెగెన్ ప్రాంతంలో సిటీ సెంటర్, విమానాశ్రయం ల మధ్య ఉన్న అమేగర్ జిల్లాలో ఉన్న మాల్ లో ఆదివారం కాల్పులు జరిపాడు అగంతకుడు. కాల్పుల శబ్ధాలు విన్న జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.
SON DAKİKA? Danimarka’nın Başkenti Kopenhag’da bir AVM’yi basan silahlı saldırganlar çevreyi rastgele taradı, ölü ve yaralıların olduğu bildiriliyor pic.twitter.com/3iZRJ2cluR
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షాపింగ్‌మాల్‌ను చుట్టుముట్టారు. ఆదివారం సాయంత్రం 5.37 గంటల సమయంలో మాల్‌లో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం 11 నిమిషాల్లోనే 22 ఏండ్ల వయస్సు కలగిన అనుమానితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
SON DAKİKA? Danimarka’nın Başkenti Kopenhag’da bir AVM’yi basan silahlı saldırganlar çevreyi rastgele taradı, ölü ve yaralıların olduğu bildiriliyor pic.twitter.com/3iZRJ2cluR