256 Year Old Man: ప్రపంచంలో భూమిమీద ఎవరైనా నూరేళ్లు బతికితే చాలు అనుకునేవారు.. కాలానుగుణంగా మనిషి తిండి జీవన విధానంలో చోటు చేసుకున్న మార్పులతో ఆయుః ప్రమాణం తగ్గి ఇప్పుడు నూరేళ్లు బతికే మనుషులు తక్కువే అని చెప్పవచ్చు.. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో 60 ఏళ్ళు బతికినా చాలు అనుకునే స్టేజ్ కి మనిషి వచ్చేశాడు.. అందుకే 100 ఏళ్ళు దాటి మనిషి ఆరోగ్యంగా బతికితే వింతగా చెప్పుకుంటున్నాం.. అయితే ఓ వ్యక్తి ఏకంగా డబుల్ సెంచరీ దాటి ఏకంగా 256 ఏళ్ళు బతికాడట.. ఇది నిజంగా ప్రస్తుత జనరేషన్ కు షాకింగ్ విషయం.. చైనా కు చెందిన లీ చింగ్ యుయెన్ 256 ఏళ్ళు బతికినట్లు తెలుస్తోంది.
చైనాలోకి సిచుయాన్ ప్రాంతంలో జన్మించిన లీ చింగ్ యుయెన్10 ఏళ్ల వయసులో ఆయుర్వేద మూలికలు సేకరిస్తూ బతికేవాడట. ఆలా ఆయుర్వేదంతో ఏర్పడిన పరిచయంతో వైద్యుడిగా అనేక ప్రాంతాల్లో బాధితులకు వైద్య సేవలను అందిస్తూ. తిరిగాడట.. అలా తన 72వ ఏట కైక్సియన్ ప్రాంతానికి చేరుకున్నాడట.. అనంతరం 1749 సంవత్సరంలో చైనా ఆర్మీల చేరి మార్షల్ ఆర్ట్స్ ను నేర్పిస్తూ విధులు నిర్వహించాడట. చివరికి లీ చింగ్ 1927 లో తిరిగి సిచుయాన్ కి చేరుకున్నాడట.. అప్పటికే లీ కి 24 మంది ని పెళ్లి చేసుకున్నాడు.. ఆ 24 మంది భార్యలతో 500మంది సంతానాన్ని కన్నాడు. ఇక ఆయన జీవిత ప్రయాణం 256 ఏళ్లలో 11 తరాలను చూశాడట..
లీ చింగ్ యుయెన్ చివరకి 1933 లో మరణించాడు. ఆయన మరణించే సమయంలో లీ వయస్సు 256 సంవత్సరాలు. ఇది చరిత్రలోనే తొలిసారి జరిగిన ఘటన. అయితే యుయెన్ వయసు పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. లీ చింగ్ స్వయంగా తాను 1736లో జన్మించానని చెప్పాడట. అయితే చెంగుడు యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ మాత్రం లీ చింగ్ 1677 లో జన్మించారని చెప్పాడు.
అయితే 1930లో న్యూయార్స్ టైమ్స్ లీ చింగ్ యన్ పై ఓ కథనం ప్రచురించింది. అందులో లీ చింగ్ కు 150వ జన్మదిన శుభాకాంక్షలు 1827 లో చైనా ప్రభుత్వం చెప్పిందని.. అనంతరం1877 ఏడాదిలో 200 వ జన్మదిన శుభాకాంక్షలు చెప్పినల్టు ఆధారాలున్నాయని తెలిపింది. పుట్టినరోజు సందర్భంగా అభినందించి అందించిన పత్రాలను ఆ కధనంలో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. ఆ పత్రిక కరస్పాండెంట్ లి పరిసరాల్లోని చాలా మంది వృద్ధులు, ఆ తాత తరాలను చూశామని.. చెప్పారని అన్నాడు.
దీంతో ప్రొపెషర్ .. వార్త పత్రిక కధనం ప్రకారం లీ చింగ్ 197 ఏళ్ళు,లేదా 256 ఏళ్ళు బతికి నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. లీ చింగ్ మరణించే సమయంలో అతని యొక్క 24 వ భార్య 60 సంవత్సరాల ఒక మహిళ ఉన్నారు. యాంగ్ సేన్ అతని గురించి తెలియజేస్తూ..
250 సంవత్సరాల వయస్సులో కూడా మంచి కంటి చూపు ఉంది మరియు లి ఏడు అడుగుల పొడవు, చాలా పొడవాటి వేలుగోళ్లు కలిగి ఉన్నాడని తెలిపాడు. ఇక లీ చింగ్ తాను అంతకాలం బతకడానికి మంచి శృంగార జీవితం ఒకటైతే.. మరొన్ని నియమాలను పాటించానని తెలిపాడు.. అందులో కొన్ని మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడం. తాబేలులా కూర్చోవడం.. పావురంలా నడవడం.. ఇక కుక్కలా నిద్రించడం తన ఆయుస్సు కు కారణమని ఆయన నమ్మేవాడని తెలుస్తోంది.
Also Read: రక్తాన్ని శుభ్రపరిచే బీట్‌రూట్‌ని మీ పిల్లలు తినడంలేదా.. హల్వాగా చేసి పెడితే సరి.. రెసిపీ ఏమిటంటే!