తండేల్ మూవీ సీన్ రిపీట్.. బంగ్లాదేశ్ జైలు నుంచి 23 మంది భారత మత్స్యకారుల విడుదల..
తండేల్ మూవీ సీన్ మరోసారి రిపీట్ అయింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి వెళ్లి అక్కడి అధికారులకు చిక్కిన 23 మంది భారతీయ మత్స్యకారులు ఎట్టకేలకు రిలీజ్ అయ్యారు. 23మందిలో 9మంది తెలుగువారు ఉండగా.. అధికారుల కృషితో భారత్‌కు చేరుకోనున్నారు. ఇంతకీ.. ఈ 23మంది మత్స్యకారుల విషయంలో అసలేం జరిగింది?...

పొరపాటున అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి ఎంటర్ అయిన మత్స్యకారులను పాకిస్తాన్ నేవీ అదుపులోకి తీసుకుని నిర్బంధించడం.. వారి విడుదల కోసం హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవితోపాటు బాధిత కుటుంబాలు సాగించిన పోరాటమే తండేల్ మూవీ. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ యథార్థగాధను నాగచైతన్య హీరోగా తండేల్ సినిమా తీశాడు దర్శకుడు. ఇప్పుడు ఇలాంటి ఘటనే విశాఖ పరిధిలో చోటుచేసుకుంది. సముద్రంలో వేటకు వెళ్లిన 9మంది తెలుగు మత్స్యకారులు.. గతేడాది సెప్టెంబర్ 22న అంతర్జాతీయ జలాలు దాటి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు చిక్కారు. ఈ విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వెళ్లడంతో మత్స్యకారుల విడుదలకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి.
ప్రధానంగా.. భారత ఈస్ట్ కోస్ట్ మెకానైజ్డ్ ఫిషింగ్ బోటుల ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసపల్లి జానకీరామ్.. మత్స్యకార ప్రతినిధులు పలుమార్లు బంగ్లాదేశ్ వెళ్లి అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. భారత్-బంగ్లాదేశ్ పరస్పర ఒప్పందంలో భాగంగా 23మంది భారత మత్స్యకారుల విడుదలకు అంగీకారం లభించింది. ఈ క్రమంలోనే.. వారంతా బంగ్లాదేశ్‌లోని బాగర్‌హాట్ జైలు నుంచి విడుదల అయ్యారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య బాగర్‌హాట్ జైలు నుంచి మోంగ్లా పోర్టుకు తరలించారు. అయితే.. బంగ్లాదేశ్ నేవీ సీజ్ చేసిన భారత జాలర్ల బోట్స్ రిపేర్ల నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో భారత్‌కు చేరుకుంటారు.
23 మందిలో 9 మంది తెలుగువారు మత్స్యకారులు
అటు.. 23 మందిలో 9 మంది తెలుగువారు ఉన్నారు. విడుదలైన వెంటనే కుటుంబ సభ్యులతో మాట్లాడి భావోద్వేగానికి గురయ్యారు. ఇక.. బోర్డర్ గుర్తించకపోవడమో.. ప్రమాదాల వల్లనో.. పొరపాటునో ఇతర దేశాల సముద్ర జలాల్లోకి వెళ్తుంటారు కొందరు మత్స్యకారులు.. ఆయా దేశాల అధికారుల చేతుల్లో బంధీ అవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
#Bangladesh | 23 Indian fishermen released from Bagerhat jail, repatriation underway
Twenty-three Indian fishermen were released from Bagerhat district jail of Bangladesh on Tuesday following a court order, clearing the way for their repatriation to India.
The fishermen were… pic.twitter.com/UcxzVFSB1Z
— DD News (@DDNewslive) January 27, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
