AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamala Harris: బైడెన్ వద్దు బాబోయ్.. కమలా హారిస్ వైపే మెజారిటీ డెమొక్రాట్‌లు..!

2024 United States presidential election: అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదా..? అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి ఆయన తప్పుకుంటారా..? బైడెన్ గనుక.. పోటీ నుంచి తప్పుకుంటే.. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Kamala Harris: బైడెన్ వద్దు బాబోయ్.. కమలా హారిస్ వైపే మెజారిటీ డెమొక్రాట్‌లు..!
Kamala Harris
Shaik Madar Saheb
|

Updated on: Jul 19, 2024 | 12:00 PM

Share

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.. ఓ వైపు దాడి తర్వాత మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో దూకుడుతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నప్పటికీ.. డెమోక్రాట్లలో ఆయన ఆరోగ్య పరిస్థితి పార్టీలో టెన్షన్ పుట్టిస్తోంది.. ఇలా అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ అధికార డెమోక్రాటిక్ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తీరు, వ్యవహార శైలి పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఆయనను మార్చాలనే డిమాండ్లు సొంత పార్టీలోనే వెల్లువెత్తుతున్నాయి. బైడెన్‌కు ప్రత్యామ్నాయం కమలా హ్యారీస్ అన్న న్యూస్ బాగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని బైడెన్ వర్గాలు కూడా నిజమే అన్నట్లు తలూపుతున్నారు. దాదాపు చాలా మంది బైడెన్ కంటే కమలా హ్యారిస్ బెటర్ అంటూ పేర్కొంటుండటం సంచలనంగా మారింది..

గత వారం రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన డిబెట్‌లో బైడెన్ తడబడ్డారు. కొన్ని సార్లు అసంబద్దమైన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలు డెమోక్రాట్లను కలవరానికి గురి చేస్తున్నాయి. రెండోసారి అమెరికా అధ్యక్షునిగా సర్వీస్ చేసేందుకు ఆయన సమర్థత సరిపోదనే మాట వినిపిస్తోంది. అంతేకాకుండా ఇటీవల న్యూస్ ఏజెన్సీలు జరిపిన సర్వేలు కూడా బైడెన్‌కు ప్రత్యామ్నాయం కమలా హరీస్ అని చెబుతున్నాయి. ఈ సర్వేల్లో ట్రంప్-బైడెన్ ఇద్దరి కంటే 6 పాయింట్ల ముందంజలో ఉన్నారట కమలా హరీస్. డెమోక్రాట్లలోని 10మందిలో ఆరుగు కమలా హ్యారిస్ కు మద్దతు తెలపగా.. ఇద్దరు సూటవ్వరని.. మరో ఇద్దరు తెలియదని చెప్పినట్లు ఓ సర్వే తెలిపింది.. మెజారిటీ డెమొక్రాట్‌లు కమలా హారిస్ వైపు నిలుస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..

ఈ క్రమంలోనే అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించే సత్తా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు ఉందని పలువురు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా, డెమొక్రాటిక్ పార్టీ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయావకాశాలు సన్నగిల్లాయని, అభ్యర్ధిత్వంపై పునరాలోచించుకోవాలని తన సన్నిహితులో ఒబామా చెప్పడం హాట్‌ టాపిక్‌గా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..