- Telugu News Photo Gallery Business photos Indian Driving License: Foreign Countries That Accept Indian Driving Licence
Indian Driving License: భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఏయే దేశాల్లో అనుమతి ఉంటుందో తెలుసా?
వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండటం తప్పనిసరి. అయితే ఒక దేశంలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ మరో దేశంలో పని చేయదు. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే తీసుకోవాలి. అయితే భారతదేశానికి చెందిన డ్రైవింగ్ లైసెన్స్ కొన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుంది. అయితే కొన్ని దేశాల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. మరి భారతీయ..
Updated on: Jul 19, 2024 | 12:13 PM

వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండటం తప్పనిసరి. అయితే ఒక దేశంలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ మరో దేశంలో పని చేయదు. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే తీసుకోవాలి. అయితే భారతదేశానికి చెందిన డ్రైవింగ్ లైసెన్స్ కొన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుంది. అయితే కొన్ని దేశాల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. మరి భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అయ్యే దేశాలు ఏంటో తెలుసుకోండి.

మారిషస్ (Mauritius): ఈ దేశంలో భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ నాలుగు వారాలపాటు చెల్లుబాటు అవుతుంది. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీరు ఇక్కడ బీచ్‌లో నాలుగు వారాల పాటు కారులో ప్రయాణించవచ్చు.

స్పెయిన్ (Spain): ఈ దేశంలో కూడా భారత్‌కు చెందిన డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది. అయితే, ఇక్కడ రోడ్ ట్రిప్ చేయడానికి మీరు ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

స్వీడన్ (Sweden): ఈ దేశంలో భారతీయ లైసెన్స్ కూడా చెల్లుతుంది. ఇక్కడ మీరు రోడ్ ట్రిప్‌లో అందమైన ద్వీపానికి అడవి అందాలను అస్వాధించవచ్చు. దాని కోసం మీ వద్ద ఉన్న లైసెన్స్ భాషకు ప్రాధాన్యత ఉంటుంది. అది కూడా స్వీడిష్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ భాషలో ఉండాలి.

అమెరికా (America) మీరు అమెరికాకు వెళుతున్నట్లయితే, ఇక్కడ కూడా డ్రైవింగ్ చేయవచ్చు. మీ డ్రైవింగ్ లైసెన్స్‌ని తీసుకెళ్లండి. భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో మీరు ఇక్కడ ఫారమ్ 1-94ని తీసుకెళ్లాలి.

సింగపూర్ (Singapore)లో కూడా భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుతుంది. సింగపూర్‌లో కూడా మీరు కారు నడపడం ఆనందించవచ్చు. ఇక్కడ డ్రైవింగ్ చేయడానికి 18 ఏళ్లు పైబడి ఉండాలి.

స్విట్జర్లాండ్ (Switzerland)లో కూడా రోడ్ డ్రిప్పింగ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ మీరు లైసెన్స్ ఇంగ్లీష్ కాపీని తీసుకెళ్లాలి.





























