
Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడి 14 మంది మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. వివరాల్లోకెళితే.. తూర్పు నేపాల్‌లో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి 300 మీటర్ల లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉందని చెబుతున్నారు అధికారులు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి ఐదుగురిని సజీవంగా రక్షించారు అధికారులు. ఘటనాస్థలిలో పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలను చేపట్టారు. మరోవైపు ఆస్పత్రి ప్రాంగణం శవాలతో, మృతుల బంధువులతో బీభత్సంగా కనిపించింది. చనిపోయిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. గురువారం ఉదయం శంఖువాసవలోని మాడి నుంచి ఝాపాలోని దమక్‌కు ఈ బస్సు బయలు దేరిందని తెలిపారు అధికారులు. ఓ కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయిందని చెబుతున్నారు.
Also read:
UP Elections Results 2022: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ విజయానికి 10 ముఖ్యమైన కారణాలివే..!