Myanmar: మయన్మార్‌లో స్థానికులపై వైమానిక దాడులు..100 మంది దుర్మరణం

|

Apr 12, 2023 | 8:12 AM

మయన్మార్ లో మళ్లీ మిలటరీ దాడులు జరిగాయి. ఓ గ్రామంలో సైనిక పాలనను వ్యతిరేకించే వర్గం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీంతో మయన్మార్ సైన్యం ఆ గ్రామంలోని వైమానిక దాడులు నిర్వహించింది.

Myanmar: మయన్మార్‌లో స్థానికులపై వైమానిక దాడులు..100 మంది దుర్మరణం
Myanmar Military
Follow us on

మయన్మార్ లో మళ్లీ మిలటరీ దాడులు జరిగాయి. ఓ గ్రామంలో సైనిక పాలనను వ్యతిరేకించే వర్గం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీంతో మయన్మార్ సైన్యం ఆ గ్రామంలోని వైమానిక దాడులు నిర్వహించింది. ఈ భీకర దాడిలో దాదాపు 100 మంది వరకు చనిపోయారు. మృతుల్లో 25 మందికి పైగా చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. కాన్‌బలు పట్టణం సమీపంలోని పజిగ్గీ గ్రామ శివార్లలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నందుకే ఈ దాడి చేసినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం ప్రకటించింది.

అయితే ఫిబ్రవరి 2021లో సైన్యం.. ప్రజాస్వామ్య ప్రభుత్వం నుంచి అధికారాన్ని లాక్కుంది ఇక అప్పటి నుంచి సైనిక పాలనను వ్యతిరేకించే వారిని అణచివేసేందుకు విపరీతంగా వైమానిక దాడులు జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భద్రతా బలగాలు దాదాపు 3,000 మంది పౌరులను పొట్టనపెట్టుకున్నట్లు ఓ అంచనా ఉంది. మంగళవారం ఉదయం మాండలేకు 110 కిలోమీటర్ల దూరంలోని పజిగ్గీ గ్రామ శివార్లో సైనిక పాలనను వ్యతిరేకించే ప్రతిపక్షం..స్థానిక కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటుచేసింది. ఈ వేడుకకు సుమారు 150 మంది వరకు హాజరయ్యారు. సరిగ్గా ఆ సమయంలోనే సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. అయితే ఈ ఘటనను ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. మయన్మార్ ప్రజలను కాపడటంలో మిలిటరీ ప్రభుత్వం మరోసారి చట్టపరమైన బాధ్యతలను విస్మరించిందని ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..