Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైవేపై కారు నడిపిన ఐదేళ్ల బాలుడు.. వీడియో చూసి నెటిజన్ల ఆగ్రహం.. తల్లిదండ్రులపై చర్యలకు డిమాండ్‌

పాకిస్తాన్‌లో ఓ బిజీ హైవేపై ఐదేళ్ల బాలుడు ఏకంగా బ్లాక్‌ టొయోటా కారును నడిపిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 27 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియోలో చిన్నారి బ్లాక్‌ టొయోటా ల్యాండ్‌ క్రూజర్‌ వీ8ని నడిపిన దృశ్యాలు...

హైవేపై కారు నడిపిన ఐదేళ్ల బాలుడు.. వీడియో చూసి నెటిజన్ల ఆగ్రహం.. తల్లిదండ్రులపై చర్యలకు డిమాండ్‌
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 29, 2021 | 8:17 PM

పాకిస్తాన్‌లో ఓ బిజీ హైవేపై ఐదేళ్ల బాలుడు ఏకంగా బ్లాక్‌ టొయోటా కారును నడిపిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 27 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియోలో చిన్నారి బ్లాక్‌ టొయోటా ల్యాండ్‌ క్రూజర్‌ వీ8ని నడిపిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన బోసన్‌ మీదుగా బాలుడు అత్యంత వేగంగా కారును నడిపాడు. అసలు ఆ బాలుడి పొడవెంత..అతని పాదం కనీసం పెడల్స్‌ను టచ్‌ చేసిందా..? అని ఈ వీడియోకు క్యాప్షన్‌ జతచేశారు. అలాగే ఆ సమయంలో బాలుడితో పాటు వాహనంలో ఎవరూ కనిపించలేదు.

పాకిస్తాన్‌లో ఫుల్‌ బీజీగా ఉండే రోడ్డుపై ఐదేళ్ల బాలుడు స్టీరింగ్‌ ఎదురుగా నిలబడి అతి వేగంగా కారు నడుపుతూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కారులో పెద్దవారు ఎవరూ లేకపోవడంతో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరో ఆశ్చర్యరమైన విషయం ఏంటేంటే.. వాహనాన్ని డ్రైవ్‌ చేసిన బాలుడు ఏ పోలీస్‌ చెక్‌పాయింట్‌ వద్ద కారును ఆపలేదు. అలాగే ట్రాఫిక్‌ కానిస్టేబుల్స్‌ ఎవరూ బాలుడు కారును నడుపుతున్నట్టు గుర్తించలేకపోయారు. ఎల్‌కేజీ చదివే వయసులో చిన్నారి బ్లాక్‌ టయోటా కారును నడుపుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ బాలుడి తల్లిదండ్రులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రాంక్‌ వీడియో అయినా సరే.. ఆ చిన్నారి తల్లితండ్రులను శిక్షించాలని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. తల్లిదండ్రులకు బాధ్యత లేదా? పలువురు అని ప్రశ్నించారు.

కాగా, ఈ వీడియో వైరల్‌గా మారి పోలీసుల కంటపడింది. దీంతో బాలుడి తల్లిదండ్రులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్తాన్‌ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారితో పాటు.. ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. వాహనం నడిపిన బాలుడి తల్లితండ్రులను గుర్తించేందుకు రెండు పోలీస్‌ బృందాలను నియమించామని, బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

Also Read:

Madanapalle double murder: మదనపల్లె మర్డర్స్.. తిరుపతి రుయాకు నిందితులు.. డాక్టర్లు ఏం చెప్పారంటే..?

Israeli embassy blast: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు.. పలు కార్లు ధ్వంసం