‘వై దిస్ కొలవరి’..పాండ్య బ్రదర్స్..గానా, బజానా!
ఐపీఎల్లో అద్భుత ఫామ్‌తో ఆకట్టుకోని.. టీమిండియా జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు క్రికెటర్లు పాండ్య సోదరులు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న కృనాల్ పాండ్య.. హార్దిక్ పాండ్యతో కలిసి పాడిన ఓ పాటను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తమిళ చిత్రం ‘త్రీ’లోని ‘వై దిస్ కొలవరి’ పాటను పాడుతూ కనిపించారీ సోదరులు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన కృనాల్ పాండ్య […]

ఐపీఎల్లో అద్భుత ఫామ్‌తో ఆకట్టుకోని.. టీమిండియా జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు క్రికెటర్లు పాండ్య సోదరులు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న కృనాల్ పాండ్య.. హార్దిక్ పాండ్యతో కలిసి పాడిన ఓ పాటను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తమిళ చిత్రం ‘త్రీ’లోని ‘వై దిస్ కొలవరి’ పాటను పాడుతూ కనిపించారీ సోదరులు.
ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన కృనాల్ పాండ్య మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్ ఆదివారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగనుంది.
? Why this Kolaveri Kolaveri Kolaveri Di at the Pandya music studio ?? @hardikpandya7 pic.twitter.com/Ja6cBFkFGH
— Krunal Pandya (@krunalpandya24) August 10, 2019