తన ఫ్రెండ్ ప్రాణాలు కాపాడిన 3 ఏళ్ల బాలుడికి బ్రేవరీ అవార్డు
ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ ఫూల్‌లో జారిపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తన స్నేహితుడిని ఎంతో ధైర్యంతో కాపాడాడు మూడేళ్ల బాలుడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన బ్రెజిల్‌లో..

ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ ఫూల్‌లో జారిపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తన స్నేహితుడిని ఎంతో ధైర్యంతో కాపాడాడు మూడేళ్ల బాలుడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన బ్రెజిల్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మూడేళ్ల వయస్సున్న ఇద్దరు చిన్నారులు కలిసి స్విమ్మింగ్ ఫూల్ దగ్గర ఆటాడుకుంటున్నారు. ఇలా మధ్యలో హెన్రిక్కూ అనే బాలుడు స్విమ్మింగ్ ఫూల్‌లో పడిపోయాడు. దీంతో షాక్ అయిన ఆర్థర్ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారా అని చూశాడు. ఎవరూ లేకపోవడంతో భయపడకుండా.. ఎంతో థైర్యంతో తన ఫ్రెండ్‌ని బయటకు తీశాడు. అతి కష్టం మీద హెన్రిక్కూని స్విమ్మింగ్ ఫూల్ నుంచి బయటకు లాగడు ఆర్థర్.
అనంతరం ఈ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పారు. హెన్రిక్కూ తల్లి సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఈ దృశ్యాలు కనిపించడంతో.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఆర్థర్‌ని యావత్ బ్రెటిజ్ లిటిల్ హీరోగా కొనియాడుతోంది. అభినందనలతో పాటు బ్రేవరీ అవార్డు కింద ఓ ట్రోఫీని కూడా అందజేశారు మిలటరీ పోలీసులు.
https://www.facebook.com/29bpmoficial/videos/750684329106462/?t=0
Read More:
జగనన్న విద్యాకానుక: విద్యార్థులకు ఇచ్చే స్కూల్ బ్యాగ్స్ ఇవే