యంగ్ బ్యూటీ దీపికా పిల్లి క్రేజీ ఫొటోస్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
దీపికా పిల్లి టిక్‌టాక్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. ఈ బ్యూటీ క్యూట్ లుక్స్, చలాకీతనంతో నెటిజన్లను ఆకర్షించింది. దీపికా టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోషూట్‌లు, వీడియోలతో అభిమానులను అలరిస్తూ ఉంటారు. దీపికా తెలుగు టెలివిజన్ షో "ఢీ" ద్వారా యాంకర్‌గా పాపులారిటీ సంపాధించింది.
Updated on: Apr 25, 2025 | 3:59 PM

దీపికా పిల్లి టిక్‌టాక్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. ఈ బ్యూటీ క్యూట్ లుక్స్, చలాకీతనంతో నెటిజన్లను ఆకర్షించింది. దీపికా టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోషూట్‌లు, వీడియోలతో అభిమానులను అలరిస్తూ ఉంటారు.

దీపికా తెలుగు టెలివిజన్ షో "ఢీ" ద్వారా యాంకర్‌గా పాపులారిటీ సంపాధించింది. ఈ డాన్స్ రియాలిటీ షోలో ఆమె రష్మి గౌతమ్‌తో కలిసి సందడి చేశారు. "ఢీ ప్రీమియర్స్ లీగ్", "ఢీ బజ్" వంటి షోలలో కూడా యాంకర్‌గా వ్యవహరించారు. ఆమె చలాకీతనం, అభినయం ఆమెను బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర చేశాయి.

దీపికా వెండితెరపై కూడా అడుగుపెట్టారు. ఆమె సుడిగాలి సుధీర్‌తో కలిసి "వాంటెడ్ పండుగాడు" చిత్రంలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినప్పటికీ, ఆమె నటనకు మంచి మార్కులు వచ్చాయి. ఆమె కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో కూడా నటించింది.

దీపికా ప్రస్తుతం సోలో హీరోయిన్‌గా అవకాశాలను అందిపుచ్చుకుంటూ తన నటనా ప్రతిభను నిరూపించుకోవడానికి కృషి చేస్తుంది. ఇటీవలే ప్రదీప్ మాచిరాజు సరసన అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాలో నటించింది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. తాజాగా ఈ చిన్నది పంచుకున్న ఫోటోలు నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.




