హమాస్ అగ్రనేత సిన్వర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. వీడియోను విడుదల చేసిన ఐడీఎఫ్
అక్టోబరు 7 నాటి దాడులకు సూత్రధారి, హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వర్ కదలికలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గుర్తించింది. అతడు దక్షిణ గాజాలోని ఖాన్‌యూనిస్ ప్రాంతంలో ఉన్న సొరంగాల నెట్‌వర్క్‌లోనే కుటుంబంతో సహా ఉన్నట్లు నిర్ధారించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇందులో అతడి భార్య, పిల్లలు, సోదరుడితో కలిసి ఓ సొరంగంలో నడుచుకుని వెళుతున్నట్లుంది. అతడి చేతిలో ఓ బ్యాగ్ కూడా ఉంది.
అక్టోబరు 7 నాటి దాడులకు సూత్రధారి, హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వర్ కదలికలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గుర్తించింది. అతడు దక్షిణ గాజాలోని ఖాన్‌యూనిస్ ప్రాంతంలో ఉన్న సొరంగాల నెట్‌వర్క్‌లోనే కుటుంబంతో సహా ఉన్నట్లు నిర్ధారించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇందులో అతడి భార్య, పిల్లలు, సోదరుడితో కలిసి ఓ సొరంగంలో నడుచుకుని వెళుతున్నట్లుంది. అతడి చేతిలో ఓ బ్యాగ్ కూడా ఉంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అతడే ప్రధాన లక్ష్యం అని ఐడీఎఫ్ ప్రతినిధి డానియల్ హగారీ తెలిపారు. వీడియో అక్టోబరు 10వ తేదీ నాటిదని తెలిపారు. ఇజ్రాయెల్‌పై దాడి అనంతరం కుటుంబంతో కలిసి అతడు భూగర్భ సొరంగాల్లో ముందస్తుగానే సిద్ధం చేసుకొన్న సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయాడని పేర్కొంది. ఇప్పటికే ఖాన్ యూనిస్‌లోని ఓ సమాధి కింద ఉన్న ఈ సొరంగంపై తమ బలగాలు దాడి చేశాయని చెప్పారు. దానిలో బెడ్‌రూమ్‌లు, ఖాన్ యూనిస్ బ్రిగేడ్ తూర్పు బెటాలియన్‌ల ప్రధాన కార్యాలయం ఉన్నాయన్నారు. సిన్వర్‌ను పట్టుకొనే వరకు తమ వేట ఆగదని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరో ముస్లిం దేశంలో హిందూ దేవాలయం.. త్వరలోనే నిర్మాణం
బొప్పాయి గింజలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎయిర్‌పోర్ట్‌లో దట్టమైన పొగమంచు.. గాల్లో విమానాలు చక్కర్లు.. చివరికి ??
చేతిలో చేయి వేసి.. కళ్లలోకి చూసుకుంటూ.. ప్రాణాలు విడిచిన మాజీ ప్రధాని దంపతులు