AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొప్పాయి గింజలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

బొప్పాయి గింజలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

Phani CH
|

Updated on: Feb 17, 2024 | 9:23 AM

Share

సాధాణంగా అందరూ బొప్పాయి పండు తిని అందులోని గింజలను మాత్రం పడేస్తుంటారు. కానీ బొప్పాయి పండే కాదు, గింజలు కూడా మంచి ఆరోగ్యాన్నిస్తాయి అంటున్నారు నిపుణులు. బొప్పాయి గింజల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి పోషకాలకు బొప్పాయి గింజలు నిధిలాంటివి. బొప్పాయి గింజలలో కార్పెన్ అనే పదార్ధం ఉంటుంది.

సాధాణంగా అందరూ బొప్పాయి పండు తిని అందులోని గింజలను మాత్రం పడేస్తుంటారు. కానీ బొప్పాయి పండే కాదు, గింజలు కూడా మంచి ఆరోగ్యాన్నిస్తాయి అంటున్నారు నిపుణులు. బొప్పాయి గింజల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి పోషకాలకు బొప్పాయి గింజలు నిధిలాంటివి. బొప్పాయి గింజలలో కార్పెన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది మీ ప్రేగులలోని పురుగులు, బ్యాక్టీరియాను చంపుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బొప్పాయి గింజల్లో ఒలీక్ యాసిడ్‌, ఇతర మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. ఇంకా బొప్పాయి గింజల్లో ఉండే విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్‌‌‌‌‌‌‌‌‌, పాలీఫెనాల్స్ వంటి ఇతర సమ్మేళనాలు..యాంటీ ఇన్‌ఫ్లమేటరీలుగా పనిచేస్తాయి. గౌట్, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు ఉన్నవారు బొప్పాయి గింజలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు..బొప్పాయి గింజలు మహిళలకు ఎంతో మేలు చేస్తాయి. ఋతుక్రమాన్ని ప్రేరేపించడంలో, దాని క్రమబద్ధతను పెంచడంలో తోడ్పడతాయి. నెలసరి సమయంలో నొప్పిని తగ్గించడానికీ.. బొప్పాయి గింజలు సహాయపడతాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎయిర్‌పోర్ట్‌లో దట్టమైన పొగమంచు.. గాల్లో విమానాలు చక్కర్లు.. చివరికి ??

చేతిలో చేయి వేసి.. కళ్లలోకి చూసుకుంటూ.. ప్రాణాలు విడిచిన మాజీ ప్రధాని దంపతులు

ప్రేమికులకు బంపర్ ఆఫర్.. ‘వాడుకోండి.. ఎంజాయ్‌ చేయండి’

Vijay Thalapathy: ఎంత హీరో అయితే మాత్రం అప్పనంగా అన్ని కోట్లు అడుగుతాడా ??

సినిమానా.. క్రికెటా ?? పుట్టబోయే రెండవ బిడ్డ ఎటు వైపో