చేతిలో చేయి వేసి.. కళ్లలోకి చూసుకుంటూ.. ప్రాణాలు విడిచిన మాజీ ప్రధాని దంపతులు
నెదర్లాండ్స్ మాజీ ప్రధాని డ్రైస్ వాన్ అగ్డ్ ఆయన భార్య యూజినీ కారణ్య మరణంతో లోకాన్ని విడిచారు. దీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల కారణంగానే వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డ్రైస్ స్థాపించిన మానవ హక్కుల సంస్థ ‘ది రైట్స్ ఫోరమ్’ వెల్లడించింది. డ్రైస్ వాన్ 2019లో బ్రెయిన్ హేమరేజ్ బారినపడ్డారు. చికిత్స తీసుకున్నా.. దాని నుంచి పూర్తిగా కోలుకోలేకపోయారు. యూజినీ కూడా అనారోగ్యానికి గురయ్యారు.
నెదర్లాండ్స్ మాజీ ప్రధాని డ్రైస్ వాన్ అగ్డ్ ఆయన భార్య యూజినీ కారణ్య మరణంతో లోకాన్ని విడిచారు. దీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల కారణంగానే వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డ్రైస్ స్థాపించిన మానవ హక్కుల సంస్థ ‘ది రైట్స్ ఫోరమ్’ వెల్లడించింది. డ్రైస్ వాన్ 2019లో బ్రెయిన్ హేమరేజ్ బారినపడ్డారు. చికిత్స తీసుకున్నా.. దాని నుంచి పూర్తిగా కోలుకోలేకపోయారు. యూజినీ కూడా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు. ఒకరి చేతిని మరొకరు పట్టుకుని.. కళ్లలోకి చూసుకుంటూ స్వస్థలమైన నిజ్మెజన్‌లో 70 ఏళ్ల తమ దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. నెదర్లాండ్‌లో కారుణ్య మరణం 2002లో చట్టబద్ధమైంది. ఆరు షరతులతో దీన్ని అమలు చేశారు. కారుణ్య మరణం కావాలనుకునేవారు అందుకు తగ్గ కారణాలు చూపించాల్సి ఉంటుంది. భరించలేని బాధలు, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందలేకపోవడం వంటివి ఇందులో ఉంటాయి. అనుమతి పొందిన వారికి వైద్యులు విషపు ఇంజెక్షన్‌ను ఇస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమికులకు బంపర్ ఆఫర్.. ‘వాడుకోండి.. ఎంజాయ్ చేయండి’
Vijay Thalapathy: ఎంత హీరో అయితే మాత్రం అప్పనంగా అన్ని కోట్లు అడుగుతాడా ??
సినిమానా.. క్రికెటా ?? పుట్టబోయే రెండవ బిడ్డ ఎటు వైపో