El Salvador: నాడు హత్యలకు అడ్డా.. నేడు అత్యంత సురక్షిత ప్రాంతం గా ఎల్ సాల్వడార్.
అదొక చిన్న దేశం.. అత్యధిక జనాభా కలిగిన దేశం.. అంతేకాదు నేరాలు, ఘోరాలు, హత్యలకు కేరాఫ్‌గా నిలిచిన అత్యంత భయానక ప్రాంతం... కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అత్యంత అసురక్షిత ప్రాంతం నుంచి అత్యంత సురక్షిత ప్రాంతంగా మారింది. అది ఆ దేశ అధ్యక్షుడిపై అక్కడి ప్రజలకు ఉన్న నమ్మకం. అదే ఎల్ సాల్వడార్.. మధ్య అమెరికాలోని అత్యంత చిన్న దేశానికి అధ్యక్షుడు నయూబ్ బుకెలే అధికార పగ్గాలు చేపట్టడంతో...
అదొక చిన్న దేశం.. అత్యధిక జనాభా కలిగిన దేశం.. అంతేకాదు నేరాలు, ఘోరాలు, హత్యలకు కేరాఫ్‌గా నిలిచిన అత్యంత భయానక ప్రాంతం.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అత్యంత అసురక్షిత ప్రాంతం నుంచి అత్యంత సురక్షిత ప్రాంతంగా మారింది. అది ఆ దేశ అధ్యక్షుడిపై అక్కడి ప్రజలకు ఉన్న నమ్మకం. అదే ఎల్ సాల్వడార్.. మధ్య అమెరికాలోని అత్యంత చిన్న దేశానికి అధ్యక్షుడు నయూబ్ బుకెలే అధికార పగ్గాలు చేపట్టడంతో దేశంలో నేరాలు, హత్యల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇటీవల జరిగిన ఎల్ సాల్వడార్ ఎన్నికల్లో నయీబ్ బుకెలే ఘనవిజయం సాధించి, అధ్యక్షపీఠం అధిరోహించారు. దేశంలో అంతకంతకూ దిగజారుతున్న ప్రజాస్వామ్య పరిస్థితుల దృష్ట్యా నయూబ్ బుకెలే ఆ పరిస్థితులను చక్కదిద్దుతారన్న నమ్మకంతో ఓటర్లు ఆయన పార్టీకి పట్టం కట్టారు. నయీబ్ బుకెలే దేశంలో పెరుగుతున్న హత్యల నియంత్రణకు తీసుకున్న కఠిన చర్యలపై ఎల్ సాల్వడార్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని కార్మికులైతే ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. నయీబ్ బుకెలే ఇప్పుడు ప్రపంచవ్యాపంగా కూల్ డిక్టేటర్‌గా గుర్తింపు పొందారు. ఒక నివేదిక ప్రకారం నయీబ్ బుకెలే 2019లో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎల్ సాల్వడార్‌లో శాంతిభద్రతల పరిస్థితిలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా దేశంలో భద్రతా ముప్పు గణనీయంగా తగ్గింది.
తాజాగా 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయనే గెలవడంతో అతని న్యూ ఐడియాస్ పార్టీ కార్యకర్తలు విజయోత్సాహంతో ర్యాలీలు చేపట్టారు. లెక్కలేనంతమంది బుకెలే అభిమానులు సాల్వడార్‌లోని సెంట్రల్ స్క్వేర్‌లో సమావేశమై, ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నీలి రంగు దుస్తులు ధరించి ఆనందంగా జెండాలు రెపరెపలాడించారు. 42 ఏళ్ల అధ్యక్షుడు నయీబ్ బుకెలే తాను మరోమారు సాధించిన ఈ విజయాన్ని తన పరిపాలనకు ఇదొక ‘రిఫరెండం’గా అభివర్ణించారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నేపధ్యంలో నయీబ్ బుకెలే తన భార్యతో కలిసి నేషనల్ ప్యాలెస్ బాల్కనీ నుండి మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. అందరూ కలిసి ప్రతిపక్షాన్ని కూల్చివేశారు. ఎల్ సాల్వడార్ అత్యంత అసురక్షిత దేశం అనే పేరు నుంచి అత్యంత సురక్షితమైన దేశమనే దిశకు చేరుకుంది. రాబోయే ఐదేళ్లలో మనం చాలా చేయాల్సివుంది అంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..