1700 Years Old Egg: 1700 ఏళ్ల నాటి పురాతన గుడ్డు.! అప్పటి నుండి గుడ్డు లోపల పచ్చసొన అలాగే.!
బ్రిటన్‌లో పురావస్తు శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని గుర్తించారు. మాములుగా ఏ గుడ్డు అయినా కొన్ని రోజులే నిల్వ ఉంటుంది. ఓ రోమన్ విషింగ్ వెల్‌లో ఏకంగా 17 వందల ఏళ్ల నాటి పురాతన రోమన్ గుడ్డుని గుర్తించి వెలికితీశారు. తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో మరో మూడు గుడ్లు ఉన్నప్పటికీ అవి బయటకీ తీసే క్రమంలో పగిలి దుర్గంధం వెదజల్లింది. అయితే ఈ గుడ్డుని శాస్త్రవేత్తలు జాగ్రత్తగా వెలికితీశారు.
బ్రిటన్‌లో పురావస్తు శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని గుర్తించారు. మాములుగా ఏ గుడ్డు అయినా కొన్ని రోజులే నిల్వ ఉంటుంది. ఓ రోమన్ విషింగ్ వెల్‌లో ఏకంగా 17 వందల ఏళ్ల నాటి పురాతన రోమన్ గుడ్డుని గుర్తించి వెలికితీశారు. తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో మరో మూడు గుడ్లు ఉన్నప్పటికీ అవి బయటకీ తీసే క్రమంలో పగిలి దుర్గంధం వెదజల్లింది. అయితే ఈ గుడ్డుని శాస్త్రవేత్తలు జాగ్రత్తగా వెలికితీశారు. నీటితో నిండి ఉన్న గొయ్యి నుంచి వీటిని బయటకు తీయడం జరిగింది. ఇది నాటి రోమన్‌ల వైభవాన్ని గుర్తు చేస్తోంది. ఐల్స్‌బరీ ప్రాంతంలో శాస్తవేత్తలు 2007-2016 నుంచి త్రవ్వకాలను జరుపుతున్నారు. ఇక మైక్రో స్కాన్‌లతో ఆ గుడ్డుని పరీక్షించగా దానిలో పచ్చసొన, తెల్లసొన చెక్కు చెదరకుండా ఉంది. నాటి రోమన్లు వాడిన సాంకేతికత శాస్త్రవేత్తల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఆక్స్‌ఫర్డ్ ఆర్కియాలజీ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎడ్వర్డ్ బిడ్డుల్ఫ్ మాట్లాడుతూ..అక్కడ తవ్వకాల్లో బయటపడిన వాటిని చూసి తాము ఒక్కసారిగా షాకయ్యామని, ఊహించని వాటిని కనుగొనడమే కాకుండా చెక్కుచెదరకుండా ఉండటం మరింత ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ప్రపంచంలోనే వేల ఏళ్లకూ చెక్కుచెదరని తొలి కోడిగుడ్డు ఇదే అన్నారు. నిజానికి ఆ గుడ్డు లోపల ద్రవాలు ఉండవని అనుకున్నామనీ అయితే స్కాన్‌లో పచ్చసొన, అల్బుమెన్ వంటివి కనిపించడం నిజంగా అద్భుతం అనిపించిందనీ దీన్ని తాము లండన్‌లో ఉన్న నేచురల్ హిస్టరీ మ్యూజియమ్‌కు తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. అలాగే ఆ గుడ్డుని సంరక్షించే పద్ధతుల గురించి ఆ మ్యూజియంలో ఉండే పక్షుల సంరక్షకులను సంప్రదించినట్లు పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

