Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamala Harris: కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? అమెరికాకు తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్

Kamala Harris: కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? అమెరికాకు తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్

Anil kumar poka
|

Updated on: Jul 25, 2024 | 4:34 PM

Share

US చరిత్రలో అత్యున్నత స్థాయికి వెళ్లిన మహిళ. అలాగే మొదటి ఆఫ్రికన్-అమెరికన్. మొదటి ఆసియా-అమెరికన్ వైస్ ప్రెసిడెంట్. అయితే కమల మళ్ళి వార్తల్లో నిలిచారు.. ఈసారి వైస్ ప్రెసిడెంట్గా కాదు ప్రెసిడెంట్ అభ్యర్థిగా. అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి డెమొక్రాట్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, కమలా హారిస్ రేసులో ముందుకొచ్చారు.

US చరిత్రలో అత్యున్నత స్థాయికి వెళ్లిన మహిళ. అలాగే మొదటి ఆఫ్రికన్-అమెరికన్. మొదటి ఆసియా-అమెరికన్ వైస్ ప్రెసిడెంట్. అయితే కమల మళ్ళి వార్తల్లో నిలిచారు.. ఈసారి వైస్ ప్రెసిడెంట్గా కాదు ప్రెసిడెంట్ అభ్యర్థిగా. అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి డెమొక్రాట్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, కమలా హారిస్ రేసులో ముందుకొచ్చారు. అభ్యర్థిత్వాన్ని వదులుకున్న బైడెన్ కూడా హారిస్‌కే తన మద్దతు తెలిపారు. కమలా హారిస్‌ను బైడెన్‌ నిర్భయ పోరాట యోధురాలిగా కీర్తించారు. అమెరికాలోని రాజకీయ నేతల్లో కమలా హారిస్ మంచి ప్లేస్ ఉందనే చెప్పాలి. ఆమెకు భారత్ మూలాలు కూడా ఉన్నాయి. తన భారతీయ మూలాలపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తుంటారు.

కమలా దేవి హారిస్ అక్టోబర్ 20, 1964న ఓక్లాండ్ , కాలిఫోర్నియా, లో జన్మించారు. ఆమె తల్లి, శ్యామలా గోపాలన్ ,తమిళనాడులోని చెన్నైలో జన్మించారు, క్యాన్సర్ పరిశోధకురాలు, పౌర హక్కుల కార్యకర్త.. కమలా హారిస్ తండ్రి, డోనాల్డ్ J. హారిస్ , ఆఫ్రో-జమైకన్. ఆయనప్రముఖ ఎకనామిస్ట్ ,ప్రొఫసర్. కమలకు ఏడేళ్లున్నప్పుడే ఆమె తల్లి తండ్రి విడిపోయారు. కమల తల్లి వారిని చిన్నతనంలో హిందూమతానికి దగ్గర చేసింది. వారిని సమీపంలోని హిందూ దేవాలయానికి తీసుకువెళ్లింది. అక్కడ శ్యామల అప్పుడప్పుడు పాటలు కూడా పాడేవారు. చిన్నతనంలో, ఆమెతో పాటు ఆమె సోదరి మాయ లక్ష్మి హారీస్ మద్రాసు లో ఉన్న వారి పుట్టింటివారిని చాలాసార్లు సందర్శించారు. రెండుసార్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు. లాస్ ఏంజిల్స్ న్యాయవాది డగ్లస్ ఎమ్‌హాఫ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. కమల చిన్నప్పుడే తల్లి తండ్రి విడిపోయారు. పౌర హక్కుల ఉద్యమంలో యాక్టివ్ గా ఉండే శ్యామల తన కూతుర్ని కూడా అలాగే పెంచారు.

కమలను,తన చెల్లి మాయను తన దేశం నల్ల జాతి అమ్మాయిలుగానే గుర్తిస్తుందని ఆమెకు తెలుసు. అందుకే, వాళ్లలో తల్లి శ్యామల ఆత్మవిశ్వాసాన్ని నింపారు. బలమైన అభిప్రాయాలతోపాటు నమ్మిన దాని కోసం ఎంతవరకైనా వెళ్లేలా చేశారు. ఇప్పుడు అదే కమల బలం కూడా. తనకు అన్నం, పెరుగు, ఆలుగడ్డ కూర, పప్పు, ఇడ్లీ అంటే ఇష్టం అని ఒక కార్యక్రమంలో చెప్పారు. తమ ఇంట్లో బిర్యానీ కూడా చేసుకునేవాళ్లమని కమలా హారిస్ తన పుస్తకంలో రాశారు. కమలా హారిస్‌పై ఆమె తల్లి శ్యామల గోపాలన్ ప్రభావం చాలా ఎక్కువ. తన తల్లిని కమల స్ఫూర్తిగా భావిస్తారు. కమలా హారిస్ అమ్మమ్మ పెద్దగా చదువుకోలేదు. కానీ, గృహ హింస, కుటుంబ నియంత్రణ గురించి ఇతరులకు ఆమె అవగాహన కల్పించేవారు. కమలా హారిస్ తాతయ్య భారత ప్రభుత్వంలో సీనియర్ దౌత్యవేత్త. ఆయన జాంబియాలో పనిచేశారు. ఆ దేశానికి స్వతంత్రం వచ్చాక, శరణార్థులకు పునరావాసం కల్పించేందుకు ఆయన కృషి చేశారు. తన మేనమామకు, చిన్నమ్మలతో తనకు సాన్నిహిత్యం ఉండేదని.. ఫోన్ కాల్స్, లేఖలు, అప్పుడప్పుడు పర్యటనలతో వారితో టచ్‌లో ఉండేదాన్నని కమలా హారిస్ తన పుస్తకంలో రాశారు. కమల కెరీర్ లాయర్ గా స్టార్ట్ అయింది. సెక్స్ ట్రాఫికింగ్, డ్రగ్స్ ముఠాలకు ఆపోజిట్ గా ఫైట్ చేసి బాధిత మహిళల పక్షాన నిలిచారు. డ్రగ్స్ బారిన పడి బయట పడాలనుకున్న మహిళల కోసం ఒక సంస్థ ని కూడా నడిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.