ఆహారం కావాలంటే సైనికుల కోర్కెలు తీర్చాల్సిందే
అక్కడ పట్టెడన్నం తినాలన్నా మహిళలు భయానక అనుభవం చవిచూడాల్సిన పరిస్థితి. సైనికుల లైంగిక వాంఛలు తీరిస్తేనే వారికి ఆహారం లభిస్తుంది. ఆఫ్రికా దేశమైన సూడాన్ లోని ఒమ్దుర్‌మన్ పట్టణంలోని కొందరు మహిళల దుస్థితి ఇది. ది గార్డియన్ పత్రిక దీనిపై కథనం ప్రచురించింది. ఈ పట్టణంలో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల చాలామంది పారిపోగా.. దాదాపు 24 మంది మహిళలు వారి కుటుంబాలతో సహా చిక్కుకుపోయారు.
అక్కడ పట్టెడన్నం తినాలన్నా మహిళలు భయానక అనుభవం చవిచూడాల్సిన పరిస్థితి. సైనికుల లైంగిక వాంఛలు తీరిస్తేనే వారికి ఆహారం లభిస్తుంది. ఆఫ్రికా దేశమైన సూడాన్ లోని ఒమ్దుర్‌మన్ పట్టణంలోని కొందరు మహిళల దుస్థితి ఇది. ది గార్డియన్ పత్రిక దీనిపై కథనం ప్రచురించింది. ఈ పట్టణంలో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల చాలామంది పారిపోగా.. దాదాపు 24 మంది మహిళలు వారి కుటుంబాలతో సహా చిక్కుకుపోయారు. ఇక్కడ ఆహారం కేవలం సైన్యం వద్ద మాత్రమే లభిస్తోంది. ఇక్కడ ఫ్యాక్టరీల్లోనే వారు అత్యధిక ఆహార నిల్వలు ఏర్పాటుచేశారు. ఇంట్లోని వృద్ధ తల్లిదండ్రులు, పిల్లలకు ఆహారం తీసుకొనేందుకు వచ్చిన మహిళలతో సైనికులు లైంగిక వాంఛలు తీర్చుకొంటున్నారు. ఈ విషయాన్ని బాధిత మహిళలే స్వయంగా మీడియాకు వెల్లడించారు. గతేడాది ఏప్రిల్ నెలలో అంతర్యుద్ధం మొదలైన తొలినాళ్ల నుంచే ఈ పరిస్థితి నెలకొంది. అప్పట్లో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ మధ్య ఘర్షణ ఈ సివిల్ వార్‌కు దారితీసింది. రెండు వర్గాలు తమను లైంగికంగా వేధిస్తున్నట్లు మహిళలు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాదు.. ఖాళీ ఇళ్లల్లో మిగిలిపోయిన వస్తువులను తీసుకోవాలన్నా మహిళలు సైనికుల కోర్కెలు తీర్చాల్సిందే. ఇటువంటి పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదని కేవలం తన బిడ్డల ఆకలి తీర్చడానికే తను వారు చెప్పినట్లు చేయాల్సి వచ్చిందని ఓ మహిళ వాపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kangana Ranaut: చిక్కుల్లో కంగన.. ఇప్పుడు ఎంపీ గారి పరిస్థితేంటి మరి ??
Salman Khan: స్టార్ హీరోకు ప్రాణ భయం.. అతడే నన్ను చంపాలనుకున్నాడు
ఏడాదికి రూ.2 కోట్ల జీతం.. సల్మాన్ బాడీగార్డ్ అంటే మామూలుగా ఉండదు చిన్నా
TOP 9 ET News: రేవంత్, చంద్రబాబు చేతుల మీదుగా బాలయ్యకు సన్మానం
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

