Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో కార్చిచ్చు.. మంటలు ఇప్పట్లో శాంతించేలా లేవుగా వీడియో

అమెరికాలో కార్చిచ్చు.. మంటలు ఇప్పట్లో శాంతించేలా లేవుగా వీడియో

Samatha J

|

Updated on: Mar 07, 2025 | 5:17 PM

అమెరికాలోని ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో కార్చిచ్చు వ్యాపించింది. ఇప్పటికే వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది దానిని ఆర్పేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. దక్షిణ కరోలినా రాష్ట్ర అటవీ సంరక్షణ విభాగం ప్రకారం.. ఇప్పటికే 4.9 చదరపు కిలోమీటర్ల అటవీ భూమి కాలిపోయింది. ఇప్పటి వరకు ఈ కార్చిచ్చులో ఎవరు గాయపడినట్లు, ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం లేదు. సౌత్‌ కరోలినాలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ హెన్రీ మెక్‌మాస్టర్‌ ప్రకటించారు. ఇక పరిస్థితిని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తునట్లు తెలిపారు. మొత్తం 175 ప్రదేశాల్లో మంటలు వ్యాపించాయని అన్నారు.

 నార్త్‌ కరోలినాలో నాలుగు వేర్వేరు అటవీప్రాంతాల్లో రేగిన కార్చిచ్చుతో 161 హెక్టార్లు దగ్ధమయ్యాయి. వీటిల్లో ఉవారీ నేషనల్‌ ఫారెస్ట్‌లో చెలరేగిన మంటలు అతిపెద్దవని అధికారులు చెబుతున్నారు. జపాన్‌లో గత 30 ఏళ్లలో ఎన్నడూ చూడనంత అతిపెద్ద కార్చిచ్చు వ్యాపించింది. దీంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటి వరకు 4,500 ఎకరాల్లో అటవీ సంపద కాలి బూడిదైంది. ఈ మంటలు అసలు ఇప్పట్లో శాంతించేలా లేవని అధికారులు చెబుతున్నారు. ఆ దేశ ఫైర్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ అంచనాల ప్రకారం ఈ కార్చిచ్చు కనీసం 84 ఇళ్లను కాల్చేసింది. అదే సమయంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఉదయం దాదాపు 4,600 మందిని ఇళ్లు ఖాళ్లీ చేయాలని ఆదేశించారు. 1,200 ఇళ్లలోని వారిని అత్యవసర వసతి ప్రదేశాలకు తరలించారు. దాదాపు 1,700 మంది సిబ్బంది మంటలను ఆర్పేందుకు తరలించారు. సహాయక చర్యల కోసం విమానాలను కూడా రంగంలోకి దించారు. 1992లో హోక్కైడో వచ్చిన కార్చిచ్చుతో పోలిస్తే ఇది చాలా పెద్దది. నాడు అది 1,000 హెక్టార్ల అటవీ భూమిని దగ్ధం చేసింది.

మరిన్ని వీడియోల కోసం :

మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో

గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంతో…

తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు వీడియో

వామ్మో.. ఈ పాక్‌ యువతి సంపాదన చూస్తే షాకవుతారు నెలకు ఎంతంటే?వీడియో

Published on: Mar 07, 2025 05:16 PM