కంత్రీ పాక్ కన్నింగ్ ప్లాన్.. మన చాబహర్ పోర్టు పక్కనే అమెరికా పోర్టు
భారత్‌పై అమెరికా సుంకాల దాడి కొనసాగిస్తున్న వేళ.. ఇదే అదనుగా దాయాది దేశం పాకిస్థాన్ అగ్రరాజ్యానికి మరింత దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతోంది. ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీచీఫ్ ఆసిం మునీర్‌లు అమెరికా సందర్శించారు. ఈ సందర్భంగా వైట్ హౌస్‌లో ట్రంప్‌తో ములాఖత్ అయ్యారు.
ఈ సందర్భంగా తమ దేశంలో దొరికే అరుదైన ఖనిజాలతో కూడిన ఓ పెట్టెను ట్రంప్‌నకు బహుకరించారు. ఈ ఖనిజాల్లో పాక్‌లో లభించే అరుదైన రంగురాళ్లు ఉన్నాయి. ఈ విషయానికి సంబంధించిన చిత్రాన్ని వైట్ హౌస్ విడుదలచేసింది. అయితే, ఆ పర్యటన సందర్భంగా.. అరేబియా సముద్రం తీరంలో పాక్ భూభాగంలో ఓ భారీ ఓడరేవును నిర్మించుకోండంటూ ట్రంప్‌కు పాక్ పాలకులు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బలూచిస్తాన్‌లో గ్వాదర్ జిల్లాలోని పాస్నీ పట్టణంలో ఈ పోర్టు నిర్మించాలని కోరినట్లు సమాచారం. ఇరాన్ – అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లోని ఈ వ్యూహాత్మక ప్రాంతంలో పోర్టు నిర్మాణంతో పాకిస్తాన్‌లోని అరుదైన ఖనిజాల తరలింపు సులభతరం కావటమే గాక తన ప్రత్యర్థి దేశమైన ఇరాన్‌కు పక్కలో బల్లెంలా మారవచ్చని అమెరికా.. వ్యూహంగా కనిపిస్తోంది. తన వ్యూహంలో పాకిస్తాన్‌ను ఓ పావుగా అమెరికా వాడుకుంటోంది. పాకిస్తాన్‌లో 17 రకాల రేర్ ఎర్త్ మెటల్స్ నిక్షేపాలున్నాయి. వీటిని వెలికితీయడం పాక్‌కు ఆర్థికంగా తలకు మించిన భారమే. ఫైటర్ జెట్స్, గైడెడ్ క్షిపణులు, ఎలక్ట్రిక్ కార్లు, స్మార్ట్ ఫోన్లలో ఈ ఖనిజాలను ఉపయోగిస్తుంటారు. ఇటీవల యూఎస్‌కు చెందిన స్ట్రాటజిక్ మెటల్స్ సంస్థ 500 మిలియన్ డాలర్లు పాక్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఓకే చెప్పింది. దీనిపై పాక్ సైన్యానికి చెందిన ఫ్రాంటియర్ వర్క్స్ సంస్థతో ఎంవోయు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అమెరికా కంపెనీ పాకిస్తాన్‌లో పాలీ మెటాలిక్ రిఫైనరీని ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందంతో పాక్ నేతలు ఆనందంతో పొంగిపోతున్నారు. తమ ఆర్థిక సమస్యలు తీరిపోతాయని ఆశిస్తున్నారు. అదే సమయంలో భారత్ మీద కోపంగా ఉన్న అమెరికా అధ్యక్షుడిని తమవైపు తిప్పుకోవచ్చనే వ్యూహంతో పాక్ పాలకులు అడుగులు వేస్తున్నారు. భారత ప్రభుత్వం నిర్మిస్తున్న చాబహర్ పోర్టుకు 300 కిలోమీటర్ల దూరంలోనే అమెరికా పోర్టు రానుంది. ఈ ఓడరేవు భారత్‌కు అత్యంత కీలకం. పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఆసియాకు నౌకలు రాకపోకలు సాగించవచ్చు. చాబహర్ కోసం 2024లో భారత్, ఇరాన్‌లు ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే ఒకవైపు అమెరికా పెట్టుబడులను స్వీకరిస్తూ.. మరోవైపు ఇప్పటికే చైనాతో దోస్తీచేస్తూ ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంటున్న పాకిస్తాన్ వైఖరిని చైనా ఏవిధంగా స్వాగతిస్తుందో వేచిచూడాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: విద్యార్ధులకు సమంత కీలక సూచన.. చదువుతోపాటు వాటిపై కూడా దృష్టి పెట్టాలి
భార్య వెళ్లిపోయిందని చిన్నమ్మపై పగ.. 13 ఏళ్ల తర్వాత
దూసుకుపోతున్న బంగారం ధర తులం ఎంతంటే
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

