AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాదీలు బీ అటెన్షన్ !! ఇది వింటే మీకు పండగే

హైదరాబాదీలు బీ అటెన్షన్ !! ఇది వింటే మీకు పండగే

Phani CH
|

Updated on: Oct 07, 2025 | 6:47 PM

Share

హైదరాబాద్ నగరంలో మెట్రో రెండో దశ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా సన్నద్ధమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు కనీసం కొన్ని కారిడార్లను పూర్తి చేయాలన్న లక్ష్యంతో సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. మొత్తం 162.9 కిలోమీటర్ల విస్తీర్ణంలో 8 కారిడార్ల నిర్మాణానికి రూ.43,847 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.

ప్రాజెక్ట్‌కి 48 శాతం రుణాలను అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా 2–4 శాతం వడ్డీతో సేకరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం సావరీన్ గ్యారంటీతో పాటు 18 శాతం నిధులు సమకూర్చనుంది. ప్రతి కారిడార్‌ను వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వేర్వేరుగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఒక్కో కారిడార్‌ను ఒక్కో నిర్మాణ సంస్థకు అప్పగిస్తే పనులు ఆలస్యమయ్యే అవకాశాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా, ఎల్బీనగర్–హయత్‌నగర్ , ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట, రాయదుర్గం–కోకాపేట్ నియోపోలిస్ వంటి చిన్న కారిడార్లను వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో సర్కారు ముందుకు సాగుతోంది. రెండో దశ ప్రాజెక్టులో భాగమైన ఓల్డ్‌సిటీ కారిడార్‌కు సంబంధించి ఆస్తుల సేకరణ 65 శాతం పూర్తయింది. ఈ నెలాఖరులోగా మిగతా ఆస్తుల స్వాధీనం పూర్తి చేసి టెండర్ పిలిచే అవకాశాలు ఉన్నాయి. రెండో దశలో కొత్తగా ఐదు కారిడార్ల కోసం ఇప్పటికే ఉన్న ఉప్పల్, మియాపూర్ డిపోలను వినియోగించే అవకాశం ఉంది. దీంతో కొత్త డిపోల అవసరం గణనీయంగా తగ్గనుంది. శంషాబాద్–భారత్ ఫ్యూచర్ సిటీ, ప్యారడైజ్–మేడ్చల్, ప్యాట్నీ–శామీర్ పేట్ మార్గాలకు మాత్రమే కొత్తగా రెండు డిపోలు నిర్మిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన కియోలిస్ గ్రూప్ ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఆపరేషన్స్, మెయింటెనెన్స్ బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా దుబాయ్, లండన్, పారిస్, షాంఘై, దోహా నగరాల్లో కూడా మెట్రో రైళ్ల సేవలను నిర్వహిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఛాతీలోకి 7 బుల్లెట్లు.. వీరమరణం.. ‘కాంతార 2’ హీరోయిన్ తండ్రి ఎవరో తెలుసా ??

అనాథ పిల్లల కోసం మై హోం గ్రూప్‌ మరో బృహత్తర కార్యక్రమం

ఈజిప్టులో ఫారో చక్రవర్తి సమాధి.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న తలుపులు

ఫ్రమ్‌ కోర్ట్‌ to ఫుడ్ కోర్ట్ !! మహిళలకు గుర్తింపు, గౌరవాన్ని సాధించడమే లక్ష్యం