ఫ్రమ్ కోర్ట్ to ఫుడ్ కోర్ట్ !! మహిళలకు గుర్తింపు, గౌరవాన్ని సాధించడమే లక్ష్యం
అందరూ ఏదో ఒక వృత్తిలో స్థిరపడతాం. కానీ మనసుకు నచ్చిన విధంగా తన అభిరుచి వైపు నడిచి షెఫ్‌గా కొనసాగుతోంది మీనాక్షి. ఆమె తండ్రి లాయర్. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసేవారు. అలా చిన్నప్పటి నుంచి వాదనలు, వాయిదాలు, తీర్పులు వింటూ పెరిగింది మీనాక్షి. ఆ ప్రభావంతో తను కూడా లాయర్ కావాలనుకొని యూకేలోని న్యూకాసిల్ యూనివర్శిటీలో లా లో మాస్టర్స్ డిగ్రీ చేసింది.
ఆ తర్వాత తండ్రితో కలిసి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేసింది. ఇద్దరూ ఎన్నో కీలక కేసులను వాదించారు. క్రిమినల్ లాయర్‌గా ఆమెకు మంచి పేరుంది. లా చదివేటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వంట సొంతంగానే ప్రిపేర్ చేసేది. అంతేకాదు స్నేహితులకు వండిపెట్టేది. అప్పుడొచ్చిన ఆలోచనే ఆ తర్వాత తనను బ్యాంకాక్ వరకు తీసుకెళ్లింది. అక్కడ లే కార్డన్ బ్లూ కోర్సులో చేరింది మీనాక్షి. ఆసియాలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ మిచెలిన్-స్టార్డ్ షెఫ్ గగన్ ఆనంద్ దగ్గర అప్రెంటిస్‌షిప్ కూడా చేసింది. కోవిడ్ టైంలో ఇండియాకు వచ్చింది. ఇంటికే పరిమితమైన ఆమె టెర్రస్‌పై బ్రకోలీ, బెసిల్, లెటుస్ వంటి కూరగాయలు పండించేది. అది క్రమంగా నోయిడాలోని ఒక ఎకరంలో ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు తీసుకెళ్లింది. ఒక వైపు కోర్టు, ఇంకోవైపు ఫార్మింగ్ గురించి ఆలోచిస్తున్న తరుణంలో మీనాక్షికి ఫుడ్ కోర్ట్ మీద ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తితోనే ఢిల్లీలో “రూట్స్ కేఫ్”ను స్టార్ట్ చేసింది. ఇదొక “ఫామ్ టు టేబుల్” కాన్సెప్టె బేస్డ్ స్టార్టప్. పొలంలో పండించిన తాజా కూరగాయలను అప్పటికప్పుడు తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తారు. దీనికోసం ముందస్తు ప్లానింగ్ ఏమీ ఉండదు. కస్టమర్ ఇచ్చిన ఆర్డర్‌ను బట్టి అప్పటికప్పుడు చేసిపెడతారు. గ్లోబల్ మెనూ చాయిస్ ఉంటుంది. థాయ్ కర్రీలు, వియత్నామీస్ రోల్స్ విత్ రసం, మిల్లెట్-బేస్డ్ డిషెస్ ఉంటాయిక్కడ. రూట్స్ కేఫ్ లో పనిచేసే స్టాఫంతా మహిళలే. వీరి ఆర్థిక స్వాతంత్ర్యం, సమాజంలో గుర్తింపు, గౌరవం, ఆత్మాభిమానం అనే కాన్సెప్ట్‌తో కేఫ్‌లు నడుస్తున్నాయి. ఇప్పుడు మీనాక్షి ఢిల్లీలో మూడు ఫుడ్‌కోర్ట్‌లు నడుపుతోంది. స్టార్ట్ చేసినప్పుడు తనకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. తన పేరెంట్స్ కలగన్నది ఇది కాదు. ఇంకా తను ప్రయాణించిన మార్గమూ ఇది కాదు. అయినప్పటికీ షెఫ్ పాత్రలో ఒదిగిపోయి ఆదర్శంగా నిలుస్తోంది మీనాక్షి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహాత్మా గాంధీపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ దిగజారుడు వ్యాఖ్యలు
కాసుల వర్షం కురిపించిన భూముల వేలం
క్యూ లైన్ లో రండి.. బొత్స కుటుంబానికి చెప్పిన అధికారులు
Hyderabad: ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రోరైల్ స్టేషన్లు.. కారణమేంటి
ఎర్రచందనం స్మగ్లింగ్ లో పోలీసులకు దొరికిన ఇద్దరు పుష్ప రాజ్‌లు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

