AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈజిప్టులో ఫారో చక్రవర్తి సమాధి.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న తలుపులు

ఈజిప్టులో ఫారో చక్రవర్తి సమాధి.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న తలుపులు

Phani CH
|

Updated on: Oct 07, 2025 | 6:08 PM

Share

ఈజిప్టులో రాజులు, రాజవంశీకులు, మత గురువుల మమ్మీలు బయటపడ్డప్పుడు వాటి నుంచి ఇప్పటికీ ఏదో ఒక కొత్త విషయాన్ని వెలుగుచూస్తూనే ఉంటుంది. క్రీస్తు పూర్వం 12వ శతాబ్దానికి చెందిన మమ్మీని కనుగొన్నసైంటిస్టులు దాని పైపొరను జాగ్రత్తగా తొలగించారు. ఇప్పుడు బయటపడ్డ మమ్మీ.. క్రీస్తుపూర్వం 1390 నుంచి 1350 మధ్య కాలంలో పాలించిన ఫారోహ్ అమెన్హోతెప్ ద థర్డ్‌ మమ్మీగా కన్ఫామ్ చేసుకున్నారు సైంటిస్టులు.

మొదటిసారి పాతిపెట్టిన తర్వాత ఆ సమాధి నుంచి దానిని దొంగలు దొంగిలించగా తిరిగి రెండోసారి మమ్మీని చేసినట్లుగా తెలుస్తోంది. లక్సర్‌ నగరంలో ఫారో చక్రవర్తి సమాధిని రెండు దశాబ్దాల అనంతరం సందర్శకుల కోసం శనివారం తిరిగి తెరిచారు. ఈజిప్టును క్రీస్తు పూర్వం 1390–1350 మధ్యన పాలించిన అమెన్‌హోటెప్ ద థర్డ్‌ సమాధి ‘ప్రఖ్యాత వాలీ ఆఫ్‌ కింగ్స్‌’లో పశ్చిమ దిక్కున ఉంది. దీనిని 1799లో గుర్తించారు. ఇందులోని ప్రధానమైన సార్కోఫాగస్‌(మమ్మీ) సహా ముఖ్యమైన వస్తువులు లూటీకి గురయ్యాయని ఈజిప్షియన్‌ యాంటిక్విటీస్‌ అథారిటీ తెలిపింది. జపాన్‌ ఆర్థిక, సాంకేతిక సాయంతో రెండు దశాబ్దాలపాటు మూడు దఫాలుగా ఈ సమాధి పునరుద్ధరణ పనులు సాగాయి. ఫారో, ఆయన భార్య సమాధి గోడలపై ఉన్న చిత్రాలకు రంగులు అద్దారు. సార్కోఫాగస్‌ను ఉంచిన భారీ పెట్టె ఫ్రేమ్‌ కూడా ఇందులో ఉంది. వ్యాలీ ఆఫ్‌ కింగ్స్‌ ప్రాంతంలో 36 మీటర్ల పొడవు, 14 మీటర్ల లోతున మెట్ల దారి సమాధికి దారి తీస్తుంది. ఇందులో చక్రవర్తిని ఉంచిన ప్రధాన సమాధి ఛాంబర్‌తోపాటు ఆయన ఇద్దరు భార్యలకు రెండు ఛాంబర్లున్నాయి. వ్యాలీ ఆఫ్‌ కింగ్స్‌లో ప్రాచీన ఈజిప్టును క్రీస్తుపూర్వం 1550–1292 సంవత్సరాల మధ్య పాలించిన 17 మంది రాజులు, రాణుల మమ్మీలతోపాటు మరో 16 ఇతరుల మమ్మీలున్నాయి. ఇదిలా ఉండగా పిరమిడ్స్‌కు దగ్గర్లో గ్రాండ్‌ ఈజిప్ట్ మ్యూజియంను నవంబర్‌లో ప్రారంభించనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్రమ్‌ కోర్ట్‌ to ఫుడ్ కోర్ట్ !! మహిళలకు గుర్తింపు, గౌరవాన్ని సాధించడమే లక్ష్యం

మహాత్మా గాంధీపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ దిగజారుడు వ్యాఖ్యలు

కాసుల వర్షం కురిపించిన భూముల వేలం

క్యూ లైన్ లో రండి.. బొత్స కుటుంబానికి చెప్పిన అధికారులు

Hyderabad: ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రోరైల్ స్టేషన్లు.. కారణమేంటి