అనాథ పిల్లల కోసం మై హోం గ్రూప్ మరో బృహత్తర కార్యక్రమం
సమాజ సేవలో మై హోం గ్రూప్ సంస్థ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని మరోసారి నిరూపించింది. అనాధ పిల్లలు, సింగిల్ పేరెంట్స్ పిల్లలకు మెరుగైన విద్య, వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. ముచ్చింతల్ లో 250 పడకల హాస్పిటల్ త్వరలోనే ప్రారంభిస్తామని మై హోం గ్రూప్ సంస్థ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావు తెలిపారు.
ముచ్చింతల్ స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో రోటరీ క్లబ్, రోస్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మై హోమ్ గ్రూప్ సంస్థ ఏర్పాటు చేసిన ఆలంబన అనాధ పిల్లల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రోటరీ క్లబ్, రోస్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ముచ్చింతల్ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో చదువుతున్న 22 సింగల్ పేరెంట్స్ పిల్లలకు 25 వేల రూపాయల చొప్పున చెక్కులను అందించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్, రోస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. ముచ్చింతల్ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ను మై హోం గ్రూప్ దత్తత తీసుకున్న తర్వాత రికార్డ్ స్థాయిలో అడ్మిషన్స్ జరిగాయి. అందుకు ప్రైవేటు స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను మై హోం గ్రూప్ అభివృద్ధి చేయడమే కారణమని రోటరీ క్లబ్ సభ్యులు కొనియాడారు. బాగా చదువుకునే పిల్లలకు స్పాన్సర్ షిప్ అందిస్తామని, పిల్లలు కేవలం చదువుపైనే దృష్టి పెట్టి ముచ్చింతల్ గ్రామానికి మంచి పేరు తేవాలని జూపల్లి జగపతి రావు కోరారు. ఇద్దరు విద్యార్థులను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, DRDO మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి దత్తత తీసుకున్నారని జూపల్లి జగపతి రావు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈజిప్టులో ఫారో చక్రవర్తి సమాధి.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న తలుపులు
ఫ్రమ్ కోర్ట్ to ఫుడ్ కోర్ట్ !! మహిళలకు గుర్తింపు, గౌరవాన్ని సాధించడమే లక్ష్యం
మహాత్మా గాంధీపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ దిగజారుడు వ్యాఖ్యలు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

