భార్య వెళ్లిపోయిందని చిన్నమ్మపై పగ.. 13 ఏళ్ల తర్వాత
విజయవాడలో దారుణ ఘటన జరిగగింది. గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన వృద్ధురాలి కేసును పోలీసులు ఛేదించారు. విద్యాధరపురంలో ఓ వ్యక్తి వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి, వేర్వేరు మురికి కాల్వల్లో పడేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విజయవాడను ఉలిక్కిపడేలా చేసింది. మొదట భవానీపురం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయిన ఈ కేసును చివరికి హత్యగా తేల్చారు పోలీసులు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భవానీపురం విద్యాధరపురంలో వృద్ధురాలు నివాసం ఉంటుంది. తన నివాసానికి సమీపంలో ఆమె అక్క కొడుకు.. కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. గత కొన్ని రోజుల నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి భర్తతో గొడవ పడ్డ భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. తన భార్య తనను వదిలి వెళ్లడానికి తన పిన్నే కారణమని, ఆమెపై పగ పెంచుకున్నాడు నిందితుడు. ఈ క్రమంలో ఎలాగైనా ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. పక్కా ఫ్లాన్ రెడీ చేసుకున్నాడు. ప్లాన్లో భాగంగా అక్టోబర్ 1వ తేదీన తన పిన్నికి మాయమాటలు చెప్పి బండిపై ఎక్కించుకుని తన ఇంటికి తీసుకెవెళ్ళాడు. అప్పటికే సిద్ధం చేసుకున్న పదునైన ఆయుధాలతో వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అతని మైనర్ కొడుకు కూడా సహకరించడం గమనార్హం. ఆ వృద్ధురాలి తల, కాళ్లు, చేతులు ముక్కలు ముక్కలుగా నరికి విజయవాడలోని అట్కిన్‌సన్ స్కూల్ సమీపంలోని మురికి నీటి కాల్వలో పడేశారు. అనంతరం మొండాన్ని విజయవాడ బొమ్మసాని నగర్ లో పడేశారు. ఆ తర్వాత విజయవాడ నుంచి నంద్యాలకు పారిపోయాడు. అయితే ఐదురోజులుగా వృద్ధురాలు కనిపించకపోవడంతో స్థానికులతో కలిసి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది. వృద్ధురాలిని చంపింది అక్క కొడుకేనని తేలింది. విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లోని డ్రైనేజ్ లో శరీర భాగాలు కనిపించడంతో అవి వృద్ధురాలివని గుర్తించారు పోలీసులు. మృతురాలి శరీర భాగాలను సేకరించారు. కానీ, కాళ్లు మాత్రం దొరకలేదని సమాచారం. హత్యలో మైనర్ అయిన కుమారుడి సహకారం ఉండటంతో.. ఇద్దరు నిందితులను నంద్యాలలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దూసుకుపోతున్న బంగారం ధర తులం ఎంతంటే
హైదరాబాదీలు బీ అటెన్షన్ !! ఇది వింటే మీకు పండగే
10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఛాతీలోకి 7 బుల్లెట్లు.. వీరమరణం.. ‘కాంతార 2’ హీరోయిన్ తండ్రి ఎవరో తెలుసా ??
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

