మా సినిమాల మీద మీ పెత్తనం ఏంటి ??
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆయన ఫోకస్ అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై పడింది. అమెరికా వెలుపల నిర్మించబడే సినిమాలపై 100 శాతం సుంకం విధించాలని ప్రకటించారు. ఇతర దేశాలు తమ సినిమా పరిశ్రమను లాక్కొని, అమెరికా నిర్మాణ వ్యాపారాన్ని దొంగిలిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు.
ఈమేరకు తన సోషల్ మీడియా ట్రూత్‌లో పేర్కొన్నారు. ఈ సుంకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది క్లారిటీ లేదు. ట్రంప్ వ్యాఖ్యల ప్రకారం, “అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తాం. మా సినిమా పరిశ్రమను ఇతర దేశాలు దొంగిలించాయి. పిల్లల నుండి మిఠాయిలను తీసేసుకున్నట్టు మా పరిశ్రమను లాగేసుకున్నారు. కాలిఫోర్నియాకు చెందిన బలహీన, అసమర్థ గవర్నర్ కారణంగానే ఈ పరిస్థితి దాపురించింది. దీర్ఘకాలిక సమస్యను ఈ సుంకాల ద్వారా పరిష్కరిస్తూ అమెరికాను తిరిగి అగ్రస్థానంలో నిలుపుతానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే దీనిపై వైట్ హౌస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. కానీ, ఈ నిర్ణయం హాలీవుడ్ మీద ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమాలకు అమెరికా ఒక పెద్ద మార్కెట్ కావడంతో, ఈ సుంకాల నిర్ణయం భారతీయ చిత్ర పరిశ్రమపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ సుంకాల నిర్ణయం వెలువడిన వెంటనే అమెరికా మార్కెట్‌లో నెట్‌ఫ్లిక్స్ షేరు విలువ సుమారు 1.5 శాతం పడిపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామంటూ వచ్చి.. చివరికి
రాబోయే పదేళ్లలో ఉద్యోగాల స్వరూపంలో రానున్న పెను మార్పులు
కొత్త ఇంటి ఈఎంఐ కట్టడానికి ఖతర్నాక్ ఐడియా
అది నీ పిల్ల కాదే.. నా పిల్ల.. కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన కోతి
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

