USA: అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. ఎందుకో తెలుసా.?

USA: అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. ఎందుకో తెలుసా.?

Anil kumar poka

|

Updated on: Jul 05, 2024 | 3:52 PM

ఇటీవల కాలంలో తెలుగు విద్యార్థులు అమెరికాలో మృత్యువాత పడుతున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, మరో తెలుగు విద్యార్థి అమెరికాలో మృతి చెందిన ఘటన వెల్లడైంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ అనే యువకుడు స్విమ్మింగ్ పూల్ లో మునిగి చనిపోయాడు. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది.

ఇటీవల కాలంలో తెలుగు విద్యార్థులు అమెరికాలో మృత్యువాత పడుతున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, మరో తెలుగు విద్యార్థి అమెరికాలో మృతి చెందిన ఘటన వెల్లడైంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ అనే యువకుడు స్విమ్మింగ్ పూల్ లో మునిగి చనిపోయాడు. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టేందుకు దిగిన కిరణ్.. ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితులు కిరణ్‌కు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ వారికి కూడా ఈత రాకపోవడంతో నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. కిరణ్‌ మృతి ప్రమాదవశాత్తు జరిగిందని చిగాగో ఎంబసీ నిర్ధారించింది. కిరణ్‌ డెడ్‌బాడీని ఇండియాకు పంపించేందుకు రెండు మూడు రోజులు పడుతుందని తెలిపారు. కిరణ్‌ కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తోంది. కిరణ్ మృతితో అతడి స్వగ్రామం చిన్న కోరుకొండిలో విషాద ఛాయలు అలముకున్నాయి. అతడి మరణ వార్త విని కుటుంబం సోకసంద్రంలో మునిగిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.