Viral: నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఇంటికి బయల్దేరిన యువతి.. అంతలోనే..?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు బయలుదేరిన యువతి విమానం ఎక్కీ ఎక్కగానే ప్రాణాలు కోల్పోయింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జూన్ 20న ఈ విషాద ఘటన జరిగింది. పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల మన్‌ప్రీత్ కౌర్ చెఫ్ కావాలన్న ఉద్దేశంతో నాలుగేళ్లుగా మెల్‌బోర్న్‌లో శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులను చూసేందుకు గత నెల 20న భారత్ బయలుదేరింది.
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు బయలుదేరిన యువతి విమానం ఎక్కీ ఎక్కగానే ప్రాణాలు కోల్పోయింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జూన్ 20న ఈ విషాద ఘటన జరిగింది. పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల మన్‌ప్రీత్ కౌర్ చెఫ్ కావాలన్న ఉద్దేశంతో నాలుగేళ్లుగా మెల్‌బోర్న్‌లో శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులను చూసేందుకు గత నెల 20న భారత్ బయలుదేరింది. తుల్లామెరైన్ విమానాశ్రయంలో ఢిల్లీ వెళ్లేందుకు క్వాంటాస్ విమానం ఎక్కింది. అయితే, సీటుబెల్ట్ పెట్టుకుంటుండంగా ఒక్కసారిగా కిందపడి అక్కడికక్కడే మరణించింది. వెంటనే స్పందించిన విమానంలోని అత్యవసర సిబ్బంది ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
మన్‌ప్రీత్ కొంతకాలంగా టీబీ వ్యాధితో బాధపడుతోందని ఆమె స్నేహితుడు స్థానిక మీడియాకు తెలిపాడు. బహుశా టీబీ కారణంగానే ఆమె చనిపోయి ఉండొచ్చని క్వాంటాస్ అధికార ప్రతినిధి తెలిపారు. మన్‌ప్రీత్ మరణంతో ఆమె కుటుంబాన్ని ఆదుకునేందుకు స్నేహితులు ‘గో ఫండ్ మీ’లో నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. 30 వేల డాలర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఐదు రోజుల్లోనే 670 మంది దాతలు 25 వేల డాలర్ల సాయం అందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

