Crime: ఆ దేశంలో మనుషులు కన్నా తుపాకులే ఎక్కువ.. యూనివర్సిటీలో కాల్పులు

Crime: ఆ దేశంలో మనుషులు కన్నా తుపాకులే ఎక్కువ.. యూనివర్సిటీలో కాల్పులు

Anil kumar poka

|

Updated on: Aug 31, 2023 | 10:12 PM

అమెరికాలో వరుస కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అగ్రరాజ్యంలో దుండగుల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా మరోసారి అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్‌ కరోలినాలోని చాపెల్‌ హిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినాలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఫ్యాకల్టీ మెంబర్‌ మృతిచెందాడు.

అమెరికాలో వరుస కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అగ్రరాజ్యంలో దుండగుల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా మరోసారి అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్‌ కరోలినాలోని చాపెల్‌ హిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినాలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఫ్యాకల్టీ మెంబర్‌ మృతిచెందాడు.  వర్సిటీ క్యాంపస్‌లోకి చొరబడిన దుండగుడు.. సైన్స్‌ భవనంలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరెవరీకి గాయాలు కాలేదని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుడిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని నేరానికి పాల్పడింది అతనా కాదా అని తెలుసుకునే పనిలో పడ్డారు. మూడు గంటల తరువాత నిందితుడిని పట్టుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. అయితే యూనివర్శిటి క్యాంపస్ లో లాక్ డౌన్ ఎత్తివేసిన కొన్ని గంటల్లోనే ఈ దారుణం చోటుచేసుకుంది. చదువుకునే చోట ఇలా కాల్పులు జరగడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..