మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్‌లో కన్నుమూశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లి ఆయన పార్ధివ దేహానికి నివాళులర్పించారు.