షోయబ్ మాలిక్ మూడో భార్య సనా జావెద్ కు చేదు అనుభవం

షోయబ్ మాలిక్ మూడో భార్య సనా జావెద్ కు చేదు అనుభవం

Phani CH

|

Updated on: Feb 23, 2024 | 7:18 PM

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల వైవాహిక బంధం ముగిసిన సంగతి తెలిసిందే. సానియా నుంచి విడిపోయిన షోయబ్ మాలిక్... పాక్ సినీ నటి సనా జావెద్ ను పెళ్లాడాడు. వీరి వివాహంపై అటు పాకిస్థాన్ లో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షోయబ్ మాలిక్ కు ఇది మూడో పెళ్లి కాగా... సనాకు రెండో వివాహం. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల నుంచి సనాకు తాజాగా చేదు అనుభవం ఎదురయింది.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల వైవాహిక బంధం ముగిసిన సంగతి తెలిసిందే. సానియా నుంచి విడిపోయిన షోయబ్ మాలిక్… పాక్ సినీ నటి సనా జావెద్ ను పెళ్లాడాడు. వీరి వివాహంపై అటు పాకిస్థాన్ లో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షోయబ్ మాలిక్ కు ఇది మూడో పెళ్లి కాగా… సనాకు రెండో వివాహం. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల నుంచి సనాకు తాజాగా చేదు అనుభవం ఎదురయింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2024లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్ – కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ చూసేందుకు సనా క్రికెట్ స్టేడియంకు వచ్చింది. కరాచీ కింగ్స్ తరపున ఆడుతున్న షోయెబ్‌ మాలిక్ ఆటను చూసేందుకు ఆమె వచ్చింది. ఇన్నింగ్స్ బ్రేక్ మధ్యలో ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా… ఓ ప్రేక్షకుడు ఆమెను ఆట పట్టించారు. పదే పదే సానియా మీర్జా అంటూ కేకలు వేశాడు. దీంతో, తీవ్ర అసంతృప్తికి గురైన సనా… కోపంగా వెనక్కి చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

17 సార్లు లేని గర్భంతో నటన.. 98 లక్షలు హాం ఫట్