సముద్రపు ఒడ్డున యోగా చేస్తున్న నటి... అంతలోనే

సముద్రపు ఒడ్డున యోగా చేస్తున్న నటి… అంతలోనే

Phani CH

|

Updated on: Dec 07, 2024 | 11:39 AM

మృత్యువు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. అప్పటివరకూ ఆనందంగా.. ఉత్సాహంగా అందరితో కలిసి తిరగుతున్నవారే క్షణాల్లో మాయమైపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి థాయ్‌లాండ్‌లో జరిగింది. థాయ్‌లాండ్‌లోని కో స్యామ్యూయ్ ద్వీపంలోని బీచ్ ఒడ్డున యోగా చేస్తున్న రష్యన్‌ నటి కెమిల్లా బెల్యాట్స్‌కాయ భారీ అల‌ల‌కు కొట్టుకుపోయి చ‌నిపోయారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అప్పటిదాకా చ‌దును బండ‌రాయిపై ప్రశాంతంగా ధ్యానం చేస్తున్న ఆమెను ఎగ‌సిప‌డిన అల‌లు స‌ముద్రంలోకి లాగాయి. కెమిల్లాను ర‌క్షించ‌డానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. కానీ ఆయన ప్రయత్నం ఫలించలేదు. కొద్దిసేప‌టికే ఆమె మృత‌దేహం బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆమె కొట్టుకుపోయిన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక రెస్క్యూ టీమ్‌లు వేగంగా స్పందించి, నటి సముద్రంలో కొట్టుకుపోయిన 15 నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నాయి. అయితే, ప్రతికూల పరిస్థితులు వారి ప్రయత్నాలకు ఆటంకం కలిగించాయి. దాంతో వారు ఆమెను రక్షించలేకపోయారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: బాలీవుడ్‌లో బన్నీ హిస్టరీ.. కలెక్షన్స్‌లో షారుఖ్‌ను దాటి నెంబర్ 1

రూ.294 కోట్ల దిమ్మతిరిగే కలెక్షన్స్.. మొత్తానికి లెక్క తేల్చిన పుష్పరాజ్‌.. AAల్ టైం రికార్డ్ !!

ఎట్టకేలకు స్టార్ హీరో నుంచి జానికి పిలుపు.. మళ్లీ పట్టాలెక్కినట్టే !!

శ్రీశైల మల్లన్నకు మొక్కులు తీర్చుకున్న నాగచైతన్య – శోభిత

ఆటో రాంప్రసాద్‌కు యాక్సిడెంట్.. ఆసుపత్రిలో కమెడియన్