ఆటో  రాంప్రసాద్‌కు యాక్సిడెంట్.. ఆసుపత్రిలో కమెడియన్

ఆటో రాంప్రసాద్‌కు యాక్సిడెంట్.. ఆసుపత్రిలో కమెడియన్

Phani CH

|

Updated on: Dec 07, 2024 | 10:36 AM

తన కామెడీ స్కిట్స్‌తో.. జబర్దస్‌ షోలో వన్‌ ఆఫ్ ది స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాంప్రసాద్‌కు యాక్సిండెంట్ జరిగింది. ఈ కమెడియన్ ప్రయాణిస్తున్నకారు అదుపుతప్పి ముందున్న కార్‌ను ఢీకొట్టడంతో.. రాంప్రసాద్‌ కార్ ముందు భాగం డ్యామేజ్ అయింది. అందులో ఉన్న రామ్‌ ప్రసాద్‌కు గాయాలయ్యాయి.

దీంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగానే డిసెంబర్ 05న షూటింగ్ కు వెళుతుండగా తుక్కుగూడ సమీపంలో ఆటో రాంప్రసాద్కు ముందున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో ఈ కమెడియన్ కార్ ముందున్న కార్‌ను ఢీకొట్టింది. ఆ వెంటనే ఈయన కార్ వెనక ఉన్న ఆటో .. ఈ కమెడియన్ కార్‌ను ఢీకొట్టింది. దీంతో రాంప్రసాద్ కార్ ఒక్కసారిగా కుదుపులకు లోను కావడంతో.. కార్‌లో ఉన్న రాంప్రసాద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే రాంప్రసాద్‌కు యాక్సిడెంట్ అవడంపై ఆయన ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. ఆటో రాం ప్రసాద్ త్వరగా కోలుకోవాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బయటపడ్డ సంగమేశ్వర ఆలయ గోపురం

మరికాసేపట్లో తాళి కడతాడనగా పెళ్లి మండపాన్ని ధ్వంసం చేసిన కుక్క

అంతరిక్ష వ్యర్థాలతో పెను ప్రమాదం

అపచారం అపచారం.. గర్భగుడిలో కేక్ కటింగా ??

ఐక్యూలో ఐన్‌స్టీన్‌ను మించిపోయాడు !! పదేళ్ల భారత సంతతి కుర్రాడు క్రిష్‌ అరోరా