ఎట్టకేలకు స్టార్ హీరో నుంచి జానికి పిలుపు.. మళ్లీ పట్టాలెక్కినట్టే !!
తన ఎనర్జిటిక్ డ్యాన్స్ తో నేషనల్ అవార్డు అందుకోవాల్సిన జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలతో పూర్తిగా డీలా పడ్డాడు. కొరియోగ్రాఫర్ గా అవకాశాలు కూడా కరువయ్యాయి. అంతేకాదు డిసెంబర్ 05న రిలీజైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప -2లో జానీ మాస్టర్ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రాఫీ చేయాల్సి ఉంది. అయితే లైంగిక ఆరోపణలు రావడంతో ఈ ఛాన్స్‌ను కోల్పోయాడు జానీ.
ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న జానీ ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడీ ట్యాలెంటెడ్ కొరియోగ్రాఫర కు ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చినట్లు స్ట్రాంగ్ టాక్. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోన్న స్టార్ హీరోల్లో వరుణ్ ధావన్ ఒకడు. ప్రస్తుతం బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తున్నాడీ క్రేజీ హీరో. ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తేరి సినిమాకు బేబీ జాన్ అఫీషియల్ హిందీ రీమేక్. ఇప్పుడు ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కు అవకాశం వచ్చిందని టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీశైల మల్లన్నకు మొక్కులు తీర్చుకున్న నాగచైతన్య – శోభిత
ఆటో రాంప్రసాద్‌కు యాక్సిడెంట్.. ఆసుపత్రిలో కమెడియన్
Published on: Dec 07, 2024 11:07 AM
వైరల్ వీడియోలు
Latest Videos