Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం చేశారో చెప్పండి..లేదా రిజైన్‌ చేయండి వీడియో

ఏం చేశారో చెప్పండి..లేదా రిజైన్‌ చేయండి వీడియో

Samatha J

|

Updated on: Feb 27, 2025 | 1:47 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండో సారి అధ్యక్షుడు కావడంలో కీలక పాత్ర పోషించిన ఎలాన్‌ మస్క్‌ ట్రంప్‌ పాలనలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న మస్క్‌ అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు మరో షాక్‌ ఇచ్చారు. ఫెడరల్ ఉద్యోగులకు యూఎస్‌ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ నుంచి ఓ మెయిల్‌ పంపారు. అందులో ఉద్యోగులందరూ గతవారం ప్రభుత్వం కోసం తాము ఏం పని చేశారో వివరించాలని అలా చేయలేని పక్షంలో వారు తమ పదవులకు రాజీనామా చేయాలని పేర్కొన్నారు.

 ఈ మెయిల్‌కు సోమవారం రాత్రి 11:59 గంటల్లోపు..5 వాక్యాల్లో ఉద్యోగులు సమాధానమివ్వాలని మస్క్‌ ఆదేశించారు. యూఎస్‌కు చెందిన అతి పెద్ద ఉద్యోగ సంఘం అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాతీయ అధ్యక్షుడు ఎవెరెట్ కెల్లీ దీనిపై స్పందిస్తూ.. ట్రంప్‌ తీసుకుంటున్న చర్యలు ఫెడరల్ ఉద్యోగుల పట్ల, దేశ ప్రజలకు అందించే క్లిష్టమైన సేవల పట్ల ఆయనకు ఉన్న అయిష్టతను సూచిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం చట్టవిరుద్ధమైన తొలగింపులకు పాల్పడితే వాటిని సవాలు చేస్తామని పేర్కొన్నారు. తన జీవితంలో ఒక్కసారి కూడా నిజాయితీగా ప్రజా సేవ చేయని ప్రపంచ కుబేరుడు మస్క్‌తో తమ ఉద్యోగులకు విధుల గురించి చెప్పించడం అగౌరవపరచడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వచ్చిన మెయిల్‌కు ప్రతిస్పందించకూడదని.. ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

వ్యక్తి శరీరంలో 5 కిడ్నీలు..ఢిల్లీ డాక్టర్ల అద్భుతం వీడియో

ఆకాశంలో అద్భుతం..ఒకే లైన్​లోకి 7 గ్రహాలు.. ఎప్పుడు చూడొచ్చంటే..

కోడిని కోర్టుకు లాగిన వ్యక్తి.. నిద్ర చెడగొడుతోందని ఫిర్యాదు .. ఏమైందంటే..

వామ్మో.. 2025లో చాలా ఘోరాలు జరగబోతున్నాయా?