US President Salary: అమెరికా అధ్యక్షుడి జీతం ఎంతో తెలుసా.? 23 ఏళ్లుగా పెరగని జీతం..

US President Salary: అమెరికా అధ్యక్షుడి జీతం ఎంతో తెలుసా.? 23 ఏళ్లుగా పెరగని జీతం..

Anil kumar poka

|

Updated on: Nov 09, 2024 | 6:36 PM

అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన వారి జీతం ఎంత ఉంటుంది? ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి? ఇలాంటి సందేహాలు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వ్యక్తమవుతున్నాయి. అగ్రరాజ్యాన్ని పరిపాలించే వ్యక్తికి జీతం భారీగా ఉంటుందా? ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఆ డీటైల్స్ చూద్దాం.

అమెరికా అధ్యక్షుడికి వార్షిక వేతనం 4 లక్షల డాలర్లుు. భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారు రూ.3.36 కోట్లుగా ఉంటుంది. ఈ జీతంతో పాటు అధికారిక విధుల నిర్వహణకు అవసరమైన ఖర్చుల కోసం ఏడాదికి 50,000 డాలర్లు అందిస్తారు. వినోదం, ఆతిథ్యాల కోసం ఈ అదనపు నిధులనే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇతర అధికార బాధ్యతల నిర్వహణకు అవసరమైన ఖర్చులను కూడా ఈ డబ్బుతోనే సరిపెట్టుకోవాలి. గత 20 ఏళ్లుగా అమెరికా ప్రెసిడెంట్‌కు ఇదే జీతం కొనసాగుతోంది.

అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, వైట్‌హైస్‌లోకి అడుగుపెట్టేటప్పుడు, తన ఆఫీస్‌ను పునర్నిర్మాణం వంటి ఆరంభ ఖర్చుల కోసం లక్ష డాలర్లను నూతన అధ్యక్షుడికి ఇస్తారు. వైట్‌హౌస్‌ను తన కార్యాలయంగా మార్చుకోవడానికి అవసరమైన పనుల కోసం ఈ మొత్తాన్ని కేటాయిస్తారు. అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ ఏడాదికి కేవలం 2,000 డాలర్లు జీతంగా పొందారు. అయితే 18వ శతాబ్దంలో ఈ జీతం విలువైనదిగానే పరిగణిస్తారు. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ సంపదలో వృద్ధి, అధ్యక్షుల ఖర్చులు పెరిగిపోవడంతో జీతం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది.

చివరిగా జార్జ్ బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జీతాలు పెరిగాయి. ఆ తర్వాత 23 ఏళ్లలో ఒక్కసారి కూడా జీతం పెరగలేదు. అయితే ప్రెసిడెంట్‌గా సౌకర్యాలు, ప్రోత్సాహకాలు పొందుతున్నారు. విలాసవంతమైన నివాసం, ప్రయాణాలు, అధికారాలు, కనీవినీ ఎరుగని భద్రతను కల్పిస్తున్నారు. వైట్‌హౌస్‌ నివాసంతో పాటు విశ్రాంతి కోసం ప్రత్యేక సదుపాయం ఉంటుంది. ప్రెసిడెంట్ వినోదం కోసం ఏడాదికి 19,000 డాలర్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారు. ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వడం, ఈవెంట్‌లు నిర్వహించడం, ప్రత్యేక వంటలు చేయించడం వంటి వాటికి ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవాలి. ఇక ప్రెసిడెంట్ ఆరోగ్యం, వైద్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా వైద్య బృందం ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.