US Vice President: అమెరికా ఉపాధ్యక్షుడి రేసులో ఆంధ్రా అల్లుడి ప్రభంజనం.!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న అమెరికాలో గెలుపు కోసం 270 ఓట్లు అవసరం కాగా.. రిపబ్లికన్ పార్టీ మెజార్టీ మార్క్ లీడ్‌ను దాటడంతో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షులు కానున్నారు. ఇక ఉపాధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ అల్లుడు జెడీ వాన్స్ ఎన్నికకానున్నారు. గత ఎన్నికల్లో భారత మూలాలున్న కమల హారీస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కాగా.. ఈసారి తెలుగు మూలాలున్న వ్యక్తి భర్త ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు.
రిపబ్లికన్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్‌ను ట్రంప్ బరిలోకి దింపారు. జేడీ వాన్స్ అత్తింటివారు ఏపీలోని కృష్ణా జిల్లావారే. ఉషా చిలుకూరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాన్స్. భారత సంతతి ఓట్లు కూడా రాబట్టేందుకు వ్యూహాత్మకంగా వాన్స్ ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టడంతో ట్రంప్ వ్యూహం ఫలించినట్లయింది. ‘జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి. ఆమె తల్లిదండ్రులు అమెరికాలోని శాన్ డియాగోలో స్థిరపడ్డారు. ఉషా చిలుకూరి యేల్ వర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘంగా పని చేసిన అనుభవం ఆమె సొంతం. 2014లో ఆమె డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తగా తన పేరును నమోదు చేసుకోవటం విశేషం. యేల్ లా స్కూల్ లోనే జేడీ వాన్స్‌ను ఉషా తొలిసారి కలిశారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. చివరకు 2014లో కెంటకీలో వారు పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం హిందూ సంప్రదాయంలో జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు.
మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలు అందించిన జేడీ వాన్స్ ఒహాయో స్టేట్ వర్సిటీ.. యేల్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యారు. అంతేకాదు.. యేల్ లా జర్నల్ కు ఎడిటర్ గా వ్యవహరించారు. జేడీ వాన్స్ మంచి రచయిత కూడా. ఆయన ఫ్యామిలీ రిలేషన్స్‌పై రాసిన పుస్తకం అమెరికాలో బాగా పాపులర్ అయ్యింది. కుటుంబ విలువలు, సంస్కృతిలో వస్తున్న సంక్షోభంపై “హిల్‌బిల్లీ ఎలెజీ” అనే పుస్తకాన్ని ఆయన రాశారు. 2020లో ఇది ఇంటర్నేషనల్‌గా బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఉషా చిలుకూరి ఆమె భర్త జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు కాబోతుండడంతో ఆమె యూఎస్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. జేడీ వాన్స్ గెలుపుపై ఆయన భార్య ఉషా నానమ్మ శాంతమ్మ ఆనందం వ్యక్తం చేశారు. తమ మూలాలు ఉన్న వ్యక్తి అమెరికాలో గెలవడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఉషకు విశాఖపట్నంలో బంధువులున్నారు. ఉష.. శాంతమ్మ మరిది కూతురు. అయితే చాలా కాలం క్రితమే ఉషా తల్లిదండ్రులు అమెరికా వెళ్లారని చెప్పారు శాంతమ్మ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.