Gold-Silver Prices: ట్రంప్‌ ఎఫెక్ట్‌.! తగ్గుతున్న బంగారం, వెండిధరలు.. ఇదే మొదటిసారి.!

Gold-Silver Prices: ట్రంప్‌ ఎఫెక్ట్‌.! తగ్గుతున్న బంగారం, వెండిధరలు.. ఇదే మొదటిసారి.!

Anil kumar poka

|

Updated on: Nov 10, 2024 | 2:02 PM

అంతర్జాతీయంగా, దేశీయంగా గిరాకీ తగ్గడంతో బంగారం, వెండి ధరలు కొంతమేర దిగి వచ్చాయి. అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర బుధవారం ఒక్కరోజే 75 డాలర్ల మేర తగ్గి 2660 డాలర్లకు చేరింది. ఫలితంగా హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో బుధవారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.80,000 కంటే దిగి, రూ.79,100కు చేరింది. కిలో వెండి ధర కూడా రూ.92,700కు చేరింది.

అక్టోబరులో ఎన్నడూ లేనంత గరిష్ఠస్థాయికి బంగారం, వెండి ధరలు చేరాయి. పసిడి ఔన్సు గరిష్ఠంగా అక్టోబరు 30న 2801 డాలర్లకు చేరింది. ఆ పరిస్థితుల్లో దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.82,000కు చేరింది. కిలో వెండి ధర రూ.లక్షా 2 వేలు దాటింది. ఫలితంగా దేశీయంగా బంగారం, వెండి అమ్మకాలు గణనీయంగా తగ్గాయని బులియన్‌ సంఘాలు చెబుతున్నాయి. దీపావళి ముందొచ్చే ధన త్రయోదశి సందర్భంగా కూడా బంగారం అమ్మకాలు గతేడాదితో పోల్చుకుంటే 15% తగ్గాయని అంచనా వేశారు. పాత ఆభరణాలు మార్చుకుని, కొత్తవి కొనుగోలు చేసుకునే వారు పెరిగారని బులియన్‌ సంఘాలు వెల్లడించాయి. ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలోనూ బంగారం, వెండిపై లాభాల స్వీకరణ జరుగుతోంది. అధిక ధరల వద్ద కేంద్రబ్యాంకులు బంగారం కొనుగోళ్లను నిలిపేశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ తాజా సమీక్షలోనూ వడ్డీరేట్లను 0.25% తగ్గిస్తుందనే అంచనాల మధ్య, డాలర్‌కు గిరాకీ పెరిగి పుత్తడికి గిరాకీ తగ్గింది.

అక్టోబరులోనే డాలర్‌ సూచీ 3% రాణించింది. ఫలితంగా పెట్టుబడులు అటు మళ్లుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో డాలర్‌ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలను బట్టి పసిడి ధరల్లో మార్పులు చోటుచేసుకోవచ్చని, ఔన్సు బంగారం 2600 డాలర్ల స్థాయికి దిగిరావచ్చనే అంచనాను ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ వ్యక్తం చేసింది. డాలర్‌ విలువ ఎన్నడూ లేనంతగా రూ.84.30 గరిష్ట స్థాయికి చేరింది. మనదేశం బంగారం కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడి ఉన్నందున, డాలర్ల రూపేణానే అంతర్జాతీయంగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఇతర దేశాల్లో బంగారం ధరలు బాగా తగ్గినా, మనదేశంలో ఆ మేర ప్రయోజనం మన కొనుగోలుదార్లకు ఉండటం లేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.